న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెండితెరపై భారత క్రికెటర్ అరంగేట్రం.. విక్రమ్‌ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర!!

Irfan Pathan Set To make Acting Debut In Tamil Movie Starring Chiyaan Vikram
Irfan Pathan Set To Make Acting Debut In Tamil Movie starring South superstar Chiyaan Vikram

చెన్నై: భారత స్టార్ పేస్‌ బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ వెండితెరపై అరంగేట్రం చేయబోతున్నాడు. తమిళ 'చియాన్‌' విక్రమ్‌తో కలిసి త్వరలో ఓ సినిమాలో ఇర్ఫాన్‌ పఠాన్‌ నటించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇర్ఫానే స్వయంగా ట్విటర్‌లో తెలిపాడు. తమిళ యువ డైరెక్టర్ అజయ్‌ ఙ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో ఇర్ఫాన్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టనున్నాడు. ఇప్పటికే మరో బౌలర్ శ్రీశాంత్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

జింబాబ్వేపై నిషేధం ఎత్తివేత.. మహిళల టోర్నీల ప్రైజ్‌మనీ పెంపు!!జింబాబ్వేపై నిషేధం ఎత్తివేత.. మహిళల టోర్నీల ప్రైజ్‌మనీ పెంపు!!

పోలీసు అధికారి పాత్రలో ఇర్ఫాన్‌:

పోలీసు అధికారి పాత్రలో ఇర్ఫాన్‌:

ఈ సినిమాలో ఏ రకమైన పాత్ర పోషించబోతున్నదీ ఇర్ఫాన్‌ వెల్లడించలేదు. కానీ.. టర్కీకి చెందిన పోలీసు అధికారి పాత్రలో ఇర్ఫాన్‌ పఠాన్‌ కనిపించనున్నాడని సమాచారం తెలుస్తోంది. విక్రమ్‌ నటించే 58వ సినిమా ఇది. ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతం అందించనున్న ఈ సినిమా.. భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. ఇర్ఫాన్‌ పఠాన్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాణ సంస్థ సెవెన్‌ స్ర్కీన్‌ స్టూడియో ట్వీట్‌ చేసింది.

25 గెటప్స్‌లో విక్రమ్‌:

25 గెటప్స్‌లో విక్రమ్‌:

ఙ్ఞానముత్తు ఇదివరకు డిమొంటే కాలనీ, ఇమైక్క నొడిగల్‌ సినిమాలను తెరకెక్కించాడు. మూడో చిత్రంలోనే అగ్ర హీరో విక్రమ్‌తో కలిసి పనిచేయనున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో విక్రమ్‌ 25 గెటప్స్‌లో కనిపించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఒకవేళ విక్రమ్‌ 25 గెటప్స్‌లో కనిపిస్తే.. ఒకే సినిమాలో అత్యధిక పాత్రలను పోషించిన నటుడిగా విక్రమ్‌ ప్రపంచ రికార్డును నెలకొల్పుతాడు.

2003లో ఆరంగేట్రం:

2003లో ఆరంగేట్రం:

2003లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఇర్ఫాన్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఆరంగేట్రం చేసాడు. భారత్‌ తరఫున ఇప్పటి వరకు 102 వన్డేలు, 29 టెస్టులు, 24 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 1105 పరుగులు, 100 వికెట్లు.. వన్డేల్లో 1544 పరుగులు, 173 వికెట్లు.. టీ20ల్లో 172 పరుగులు, 28 వికెట్లు తీశాడు. భారత్ 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలవడంలో ఇర్ఫాన్‌ కీలకపాత్ర పోషించాడు.

 2012లో చివరి టీ20:

2012లో చివరి టీ20:

టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున హ్యాట్రిక్‌ సాధించిన రెండో ఆటగాడిగా ఇర్ఫాన్‌ పఠాన్‌ రికార్డు సృష్టించాడు. 2006లో పాక్‌పై ఈ ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ఓ సెంచరీ కూడా చేసాడు. భారత్ తరఫున ఆఖరిగా 2012లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో ఆడాడు. ఫామ్ కోల్పోయిన ఇర్ఫాన్‌.. భారత జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం దేశవాళీ టోర్నీలలో ఆడుతున్నాడు.

Story first published: Tuesday, October 15, 2019, 11:00 [IST]
Other articles published on Oct 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X