
నా కెరీర్ అప్పటికే ముగిసింది
ఇర్ఫాన్ పఠాన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'చాలా మంది 27-28 ఏళ్లలో ఆరంగేట్రం చేస్తున్నారు. 35 ఏళ్ల వరకు కొనసాగుతున్నారు. కానీ.. నా కెరీర్ 27 ఏళ్లకే ముగిసిపోయింది. నేను 27 ఏళ్లకే 301 అంతర్జాతీయ వికెట్లు తీసా. నేను 500-600 వికెట్లు, మరిన్ని పరుగులు చేయాలని కోరుకుంటున్నా. కానీ ఆలా జరగలేదు. మరొకొన్ని ఏళ్లు ఆట కోల్పోయానన్న బాధ ఉంది' అని తెలిపాడు.

నా బౌలింగ్ పట్ల చాలా సంతోషంగా లేరు
'కెరీర్ అత్యుత్తమంగా ఉన్నప్పుడే ఎక్కువ అవకాశాలు పొందాలి. నా విషయంలోఏ కారణాల వల్ల జరగలేదో తెలియదు. ముష్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించినప్పుడు నేను తిరిగి జాతీయ జట్టుకు ఆడబోనని 2016 తర్వాత తెలిసింది. సెలెక్టర్లతో మాట్లాడినప్పుడు వారు నా బౌలింగ్ పట్ల చాలా సంతోషంగా లేరు. నేను ఉత్తమ ఆల్‌రౌండర్' అని పఠాన్ పేర్కొన్నాడు.

ఇదే సరైన సమయం
'206-17 తర్వాత నాకు నేను ఆత్యవిశ్వాసం తెచ్చుకున్నా. కొన్ని లీగ్ అవకాశాలు వచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకున్నా. అదే జమ్మూ కాశ్మీర్. జమ్మూ జట్టుకు ఆడాను. మెంటార్‌గా ఉన్నా. మళ్లీ టీమిండియాకు ఆడు అని అభిమానులు కోరుతున్నారు. నాపై నమ్మకం ఉంచి ఒంటరిని చేయని అభిమానులకు కృతజ్ఞతలు. కొత్త ప్రయాణానికి ఇదే సరైన సమయం' అని పఠాన్ చెప్పుకొచ్చాడు.

తొలి ఓవర్లోనే హ్యాట్రిక్
పఠాన్ ఖాతాలో ఎన్నో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. 2003, లాహోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన యూత్ వన్డేల్లో 9/16తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. టెస్టుల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తొలి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు తీసిన ఒకేఒక్క బౌలర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. 2007లో జరిగిన అరంగేట్ర టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

2012లో చివరిసారిగా
ఇర్ఫాన్ 2012, అక్టోబర్‌లో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడాడు. 29 టెస్టుల్లో 1105 పరుగులు చేసి 100 వికెట్లు తీశాడు. 120 వన్డేల్లో 1544 పరుగులతో పాటు 173 వికెట్లు పడగొట్టాడు. ఇక 24 టీ20ల్లో 172 పరుగులు, 28 వికెట్లు తీశాడు.


Click it and Unblock the Notifications












