అసలు బౌలౌట్ గురించి పాక్‌కు అవగాహనే లేదు: ఇర్ఫాన్ పఠాన్

న్యూఢిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్ సమయంలో పాకిస్థాన్ జట్టుకు బౌలౌట్ నిబంధనపై సరైన అవగాహన లేదని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. తొలి టీ20 ప్రపంచకప్‌లో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని భారత్ విశ్వ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఈ మెగాటోర్నీలో భారత జట్టు పాకిస్థాన్‌ జట్టును రెండు సార్లు చిత్తు చేసింది. ఫైనల్లో అద్భుత విజాయన్నందుకున్న భారత్.. లీగ్ దశలోనూ దాయదీని చిత్తు చేసింది.

పాక్‌కు తెలియదు..

పాక్‌కు తెలియదు..

అయితే లీగ్ దశలో పాక్‌తో జరిగిన మ్యాచ్ టై కాగా.. ఫలితాన్ని బౌలౌట్ పద్దతి ద్వారా తేల్చారు. ఈ విధానంపై ముందే అవగాహన ఉన్న భారత్ అలవోకగా విజయాన్నందుకుంది.

ఇక బౌలౌట్ అంశంపై అప్పటి పాక్ జట్టుకు పెద్దగా పట్టులేదని ఇర్ఫాన్ పఠాన్ ఓ టీవీ షోలో మాట్లాడుతూ తెలిపాడు.. ‘ఈ అంశాన్ని అప్పటి పాకిస్థాన్ కెప్టెనే ఒక సందర్భంలో మీడియాతో చెప్పాడు. అప్పటికి మాకు బౌలౌట్‌పై పెద్దగా అవగాహనలేదని. ఇక బౌలౌట్‌కు వచ్చేసరికి పూర్తి రనప్‌తో బౌలింగ్ చేయాలా, లేక సగం రనప్‌తో బంతి విసరాలా అనే అంశంలో వాళ్లకు స్పష్టత లేదు. అదే మా జట్టు విషయానికివస్తే.. మేము ముందుగానే దానికి సిద్ధమై ఉన్నాం`అని అన్నాడు.

 మేం ముందే ప్రాక్టీస్ చేశాం..

మేం ముందే ప్రాక్టీస్ చేశాం..

ఈ అంశంపై అప్పటి జట్టు సభ్యుడు రాబిన్ ఊతప్ప మాట్లాడుతూ.. `మేము ప్రాక్టీస్ చేసిన ప్రతీసారి వెంకటేశ్ ప్రసాద్ మాతో బౌలౌట్ చేయించేవాడు. ఫుట్‌బాల్ ఆడాక ఇది తప్పనిసరి. సెహ్వాగ్‌, నేను, రోహిత్ శర్మ ఎప్పుడూ వికెట్ మిస్ చేసేవాళ్లం కాదు. అదే బౌలౌట్‌లోనూ చేసి చూపెట్టాం. కెప్టెన్‌గా ధోనీకి అదే తొలి టోర్నీ అయినా అతడు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నాడు. స్వతహగా బౌలర్‌ను కానప్పటికీ నాపై ఉన్న నమ్మకంతో అతడి ఈ అవకాశాన్ని నాకిచ్చాడు. నేను కచ్చితంగా వికెట్లను గిరాటేస్తానని ధోనీకి చెప్పా అతడు సరే వెళ్లు అన్నాడు అంతే. అంతకుముందు మ్యాచ్‌ను పరిశీలిస్తే మేము ఓడిపోయే స్థితిలోనే ఉన్నాం. శ్రీశాంత్ చక్కటి బౌలింగ్ కారణంగా మ్యాచ్ టై అయింది` అని వివరించాడు.

ముందే ఊహించాం..

ముందే ఊహించాం..

ఆ మెగాటోర్నీలో ఈ పరిస్థితి వస్తుందని ముందే ఊహించి దానికి తగ్గట్టు ఆటగాళ్లను సిద్దం చేశామని నాటి బౌలింగ్ కోచ్, భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. మ్యాచ్ టై అయితే బౌల్ ఔట్ పద్దతిని ఉపయోగిస్తారని ఆటగాళ్లను ఆ దిశగా శిక్షణనిచ్చానన్నాడు. ముఖ్యంగా నాన్ రెగ్యూలర్ బౌలర్లు సెహ్వాగ్, ఊతప్పతో ప్రాక్టీస్ చేయించి ఎవరు స్థిరంగా వికెట్లు తీయగలుగుతున్నారనే ఓ అంచనాకు వచ్చానని తెలిపాడు. తీరా ఫస్ట్ మ్యాచ్‌లోనే ఆ పరిస్థితి రావడంతో సెహ్వాగ్, ఊతప్ప, భజ్జీలతో బౌలింగ్ చేయించాలని ధోనీని ఒప్పించానన్నాడు.

3-0తో భారత్ గెలుపు..

3-0తో భారత్ గెలుపు..

పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 141 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప(50), మహేంద్ర సింగ్ ధోనీ(33) మినహా అంతా విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 141 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. అనంతరం జరిగిన బౌల్ ఔట్‌లో భారత్ 3-0తో గెలిచింది. టీమిండియా తరఫున సెహ్వాగ్, ఊతప్ప, హర్భజన్ బౌలింగ్ చేసి పాయింట్లు సాధించగా.. పాక్ తరఫున ఉమర్ గుల్, షాహిద్ అఫ్రిది, యాసిర్ అరాఫత్ విఫలమయ్యారు.

ఫస్ట్ సెంచరీ, రక్తపు జెర్సీతో ఆడిన మ్యాచ్ వరవలేనిది: సచిన్ టెండూల్కర్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, August 14, 2020, 15:21 [IST]
Other articles published on Aug 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X