న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా బాల్యంలో కపిల్‌దేవ్‌ గురించి కథలు కథలుగా చెప్పేవారు: ఇర్ఫాన్‌

Irfan Pathan says No Bigger Sporting Hero Than Kapil Dev

ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కన్నా పెద్ద స్పోర్టింగ్ హీరో లేడని మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు. తన బాల్యంలో.. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్‌‌ సాధించిన 175 పరుగుల గురించి కథలు కథలుగా చెప్పేవారని గుర్తుచేసుకున్నాడు. అతనో మ్యాచ్‌ విన్నర్‌ అని, బ్యాట్‌తో పాటు బంతితో రాణించే అద్భుత ఆటగాడని ఇర్ఫాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తన కెరీర్‌లో పాకిస్థాన్‌ క్రికెట్‌ దిగ్గజం వసీం అక్రమ్‌ స్ఫూర్తిగా నిలిచాడని చెప్పాడు.

కథలు కథలుగా చెప్పేవారు:

కథలు కథలుగా చెప్పేవారు:

ఇర్ఫాన్‌ పఠాన్‌ తాజాగా ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ... 'కపిల్‌ దేవ్‌ మ్యాచ్‌ విన్నర్. బ్యాట్‌తో పాటు బంతితో రాణించే అద్భుత ఆటగాడు. టీమిండియాలో ఎవరైనా ఆల్‌రౌండర్‌ అవ్వాలంటే.. అతనికి మించిన రోల్ మోడల్ మరొకరు లేరు. అంతలా ఆయన ప్రభావం చూపారు. నేను కపిల్‌ మ్యాచులను చాలా తక్కువ మాత్రమే చూశా. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా మ్యాచ్‌లు ప్రత్యక్షంగా ప్రసారం కాలేదు. ఒకవేళ అయినా ఇంట్లో టీవీ లేదు. మేము మా పొరుగువారి ఇంటికి వెళ్లి చూసేవాల్లం. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్ ‌సాధించిన 175 పరుగుల గురించి కథలు కథలుగా చెప్పేవారు' అని తెలిపాడు.

అలా ఎవరూ బౌలింగ్‌ చేయలేరు:

అలా ఎవరూ బౌలింగ్‌ చేయలేరు:

'జట్టులో అందరూ నిరాశపర్చినా.. తమ హీరోలు ఒంటరి పోరాటం చేసి మ్యాచ్‌ను గెలిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మొత్తం జట్టు భారాన్ని ఒక్కడే తన భుజాలపై మోయడానికి మించిన ధీరత్వం ఏముంటుంది. ఆ మజానే వేరు. ప్రపంచకప్‌ ఫైనల్లో వెస్టిండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ క్యాచ్‌ను కపిల్‌ దేవ్‌ వెనక్కి పరిగెడుతూ పట్టుకోవడం అద్భుతం. మాజీ సారథి ఘనతల్లో నేను చూసింది అదే. కపిల్‌ బౌలింగ్‌ యాక్షన్‌ ప్రత్యేకంగా ఉంటుంది, దాన్ని కాపీ చేయడం కష్టతరం. అతడిలా వేరే ఎవరూ బౌలింగ్‌ చేయలేరు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు నేను అతని నటరాజ్ షాట్ కాపీ చేయడానికి ప్రయత్నిస్తా' అని ఇర్ఫాన్‌ పఠాన్‌ చెప్పాడు.

దేశానికి ఏదైనా సేవచేయాలనుకుంటే:

దేశానికి ఏదైనా సేవచేయాలనుకుంటే:

2004 పాకిస్థాన్‌ పర్యటనకు ముందు మాజీ ఛాంపియన్‌ తనకు బౌలింగ్‌ యాక్షన్‌కు సంబంధించి పలు సూచనలు చేశాడని ఇర్ఫాన్‌ గుర్తుచేసుకున్నాడు. అలాగే 2017-18లో తాను జమ్మూ-కశ్మీర్‌ క్రికెట్‌కు మెంటార్‌గా మారడంలోనూ అతడి పాత్రే కీలకమని స్పష్టం చేశాడు. దేశానికి ఏదైనా సేవ చేయాలని ఉంటే.. ఇతర లీగ్‌ల మీద దృష్టి పెట్టకుండా ఆ రాష్ట్ర క్రికెట్‌ బాధ్యతలు తీసుకోవాలని సూచించాడని ఇర్ఫాన్‌ పేర్కొన్నాడు. అక్కడి యువకులను క్రికెట్‌ వైపు మళ్లించడమంటే దేశానికి సేవచేసినట్లని మాజీ సారథి తనతో అన్నాడని వెల్లడించాడు.

2004లో మొదటిసారి కలిశాను:

2004లో మొదటిసారి కలిశాను:

'నేను మొదటిసారి కపిల్ పాజీని 2004లో కలిశాను. ఇప్పుడు ఇద్దరం స్టార్ స్పోర్ట్స్ కోసం పనిచేస్తున్నాం. స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో అతనితో కలిసి పనిచేయడం నా ఓ మధురానుభూతి. నేను నా రోల్ మోడల్‌తో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఎప్పుడూ మాట్లాడుతోనే ఉంటాడు. ఎక్కువగా జిలేబీ తింటాడు. ఎప్పుడూ ఏదో ఒకటి తినడానికి తెస్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం పాజీ నన్ను డిల్లీలోని తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. అప్పుడు చాలా సమయం మాట్లాడుకున్నాం. స్టార్ అయినప్పటికీ అతను చాలా సింపుల్‌గా ఉంటాడు' అని ఇర్ఫాన్‌ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌‌షిప్ రేసులో బైజూస్, కోకో-కోలా, అమెజాన్‌!!

Story first published: Friday, August 7, 2020, 10:44 [IST]
Other articles published on Aug 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X