నాలుగు రోజుల టెస్టులకు ఇర్ఫాన్ పఠాన్ మద్దతు!!

హైదరాబాద్: ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌ల నిడివిని నాలుగు రోజులకు కుదించాలనే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతిపాదననకు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మద్దతు తెలిపాడు. నాలుగు రోజుల మ్యాచ్‌ల ద్వారా ఫలితాలపై మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌ల నిర్వహించాలన్నఐసీసీ ఆలోచనను మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

వ్యతిరేకిస్తున్న మాజీలు
2023 నుంచి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు అమలు చేయాలని ఐసీసీ భావిస్తుండగా.. ఇప్పటికే ఈ ప్రతిపాదనను విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, రికీ పాటింగ్, మెక్‌గ్రాత్ తప్పుబట్టారు. ఐసీసీ ప్రతిపాదనను మాజీలు అందరూ వ్యతిరేకిస్తుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్ మాత్రం మద్దతు ఇచ్చాడు. ఇప్పుడు ఈ జాబితాలో ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరాడు.

నాలుగు రోజుల టెస్టులకు మద్దతు
తాజాగా పఠాన్ మాట్లాడుతూ... 'కొన్ని సంవత్సరాలుగా నాలుగు రోజుల టెస్టులు ఉండాలని నేను చెబుతున్నా. ఇప్పుడు కాకపోయినా.. కొంతకాలం తర్వాతనైనా నాలుగు రోజులు ప్రవేశపెట్టాలి. రెండేళ్ల తర్వాత వీటిని రెగ్యులర్‌గా ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నా. రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల క్రికెట్ ఆడుతున్నాం. అందులో ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి టెస్ట్ మ్యాచ్‌లలో మార్పులు ఎందుకు చేయకూడదు?. నాలుగు రోజుల టెస్టులు ప్రవేశపెడితే ఫలితాలపై మరింత ఫోకస్ పెరుగుతుంది. నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్‌లకు నేను పూర్తిగా అంగీకరిస్తున్నా' అని అన్నాడు.

క్రికెట్‌కు టెస్ట్‌లు ప్రతీక
స్వచ్ఛమైన క్రికెట్‌కు టెస్ట్‌లు ప్రతీక అని సచిన్ అన్నాడు. క్రికెట్‌లో వన్డేలు, టీ20లు, టీ10లు వచ్చాయి. సంప్రదాయ ఫార్మాట్‌ను కుదించకూడదని సచిన్ సూచించాడు. 'డే/నైట్ టెస్టులో ఏమైనా మార్పు తీసుకొచ్చి మరింత ఆసక్తికరంగా మార్చడానికి యత్నిస్తే బాగుంటుంది. డే/నైట్ టెస్టు విజయవంతం కావడంతో దానిపై కసరత్తు చేస్తే బాగుంటుంది. సంప్రదాయ టెస్టు క్రికెట్‌ను ఒక రోజుకు తగ్గించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

2012లో చివరిసారిగా
ఇర్ఫాన్ పఠాన్ 2012, అక్టోబర్‌లో చివరిసారిగా టీమిండియా తరఫున ఆడాడు. 29 టెస్టుల్లో 1,105 పరుగులు చేసి 100 వికెట్లు తీశాడు. 120 వన్డేల్లో 1,544 పరుగులతో పాటు 173 వికెట్లు పడగొట్టాడు. ఇక 24 టీ20ల్లో 172 పరుగులు, 28 వికెట్లు తీశాడు. పఠాన్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ జట్టుకు మెంటార్‌గా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications