Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను ఏబీ డివిలియర్స్‌కు సాటి గల ప్లేయర్.. టీమిండియా బ్యాటర్‌ పట్ల ఇర్ఫాన్ పఠాన్ కితాబు

Irfan Pathan says Dinesh Karthik can play all kinds of shots like AB de Villiers

37ఏళ్ల వయసులో దినేష్ కార్తీక్.. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున అద్భుతమై ఫినిషింగ్ ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అతను 10ఇన్నింగ్స్‌లలో 183.33 స్ట్రైక్ రేటుతో 330పరుగులు చేశాడు. దీంతో ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దాదాపు మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో దినేష్ కార్తీక్ ఆకట్టుకునేలా ఆడాడు.

4వ టీ20లో హాఫ్ సెంచరీతో అద్భుత ఫినిషింగ్ ఆడి జట్టుకు మంచి స్కోరు అందివ్వడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో అతని ప్రదర్శన జట్టులో స్థానం పదిలం చేసుకోవడానికి సాయపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ మ్యాచ్‌లో ఇండియా 82పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక ఈ సిరీస్ 2-2తో సమమైన సంగతి తెలిసిందే.

2006లో టీమిండియా ఆడిన మొట్టమొదటి టీ20 జట్టులో దినేష్ కార్తీక్‌తో పాటు మాజీ భారత బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా సిరీస్‌లోని అయిదో మ్యాచ్ వాష్ అవుట్ అయ్యాక స్టార్ స్పోర్ట్స్‌లో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడాడు. దినేష్ కార్తీక్, ప్రఖ్యాత మాజీ ప్రొటీస్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మధ్య గల సారూప్యతలను అతను ప్రస్తావించాడు. 'దినేష్ కార్తీక్.. ఏబీ డివిలియర్స్ అంత రేంజ్ ఉన్న ఆటగాడుగా మీకు కనిపించడు. అయినా నేను అతనిని ఏబీ డివిలియర్స్‌తో పోల్చడం లేదు.. కానీ అతని సామర్థ్యం డివిలియర్స్‌తో సరిసమానంగా ఉంటుంది.

డివిలియర్స్ లాగే.. కార్తీక్ స్వీప్ షాట్లు ఆడగలడు. స్విచ్ హిట్లు ఆడగలడు. అతని దగ్గర అన్ని రకాల షాట్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు.. అతను ట్రాక్ డౌన్ ఛార్జ్ కూడా చేస్తాడు, అతను ఎక్కువ లెగ్-సైడ్‌ హిట్టింగ్‌ను ఇష్టపడతాడు. కానీ అతను తన క్రీజులో వడివడిగా కదిలే విధానం.. బాల్‌ను లైన్‌లోకి తెచ్చే విధానం అద్భుతమైంది. అతను స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఆడగలడు. మీరు అతనిని బాల్ వన్ నుంచి కొట్టాలని అడిగితే.. అతను దాన్ని కూడా చేయగలడు. ఒక ఫినిషర్‌‌కు ఇది చాలా ముఖ్యం. దినేష్ కార్తీక్ చేయగలిగింది అదే' అని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు.

Story first published: Wednesday, June 22, 2022, 17:07 [IST]
Other articles published on Jun 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+