నా దేశం గొప్పదని నినాదాలు చేస్తే లాభం లేదు.. మాటలతో పాటే నడవాలి: ఇర్ఫాన్

వడోదర: సమాజాన్ని పట్టి పీడిస్తున్న అంశాలపై క్రీడా ప్రముఖులు, క్రికెటర్లు చాలా అరుదుగా స్పందిస్తారని టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వారికున్న అభద్రతాభావం వల్లే సున్నితమైన అంశాలపై స్పందించరని పేర్కొన్నాడు. సామాజిక మాధ్యమాల వేదికగా సమాజంలో జరుగుతున్న విషయాలపై ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్ ఎప్పటికప్పుడు స్పందిస్తుంటారు. దీంతో ఒక్కోసారి నెటిజన్ల నుంచి కూడా వారికి వ్యతిరేకత కూడా ఎదురౌతుంది. అయినా ఈ ఇద్దరు మాజీలు వాటిని పట్టించుకోరు. కరోనాపై పోరాడేందుకు కూడా పఠాన్, గంభీర్ చాలా సాయం చేసారు.

అందుకే జామియా ఘటనపై స్పందించా:
తాజాగా 'బియాండ్ ద ఫీల్డ్' అనే ఆన్‌లైన్ కార్యక్రమంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... 'ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా, దేశానికి అత్యున్నత స్థాయిలో సేవలందించిన ఆటగాడిగా అందరం ఐక్యంగా ఉండాలనే కోరుకుంటా. నా వ్యక్తిగత జీవితం ఎవరికీ తెలియకుండా ఉండాలని అనుకుంటా. కానీ నా ఆలోచనలను మాత్రం ప్రజలతో పంచుకుంటా. ఇలా చేయడంతోనే దేశం బాగుపడుతుందని నేను భావిస్తా. ఈ క్రమంలోనే జామియా ఘటనపై స్పందించాను' అని తెలిపాడు.

నా దేశం గొప్పదని నినాదాలు చేస్తే సరిపోదు:
'మాములుగా ఎవరైనా క్రీడా ప్రముఖులు లేదా క్రికెటర్లు సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై స్పందించొచ్చు. అదే దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. అలా కాకుండా నా దేశం గొప్పదని నినాదాలు చేస్తే.. ఎలాంటి లాభం ఉండదు. మన మాటలతో పాటే నడవాలి. ఇలా సున్నితమైన అంశాలపై ఇతరులెందుకు స్పందించరని అడిగితే.. వారికి అభద్రతాభావం ఉంటుందని నా అభిప్రాయం. ఉదాహరణకు ప్రత్యర్థి జట్టును ఒక వ్యాఖ్యాత పొగిడితే.. ఓ సినీతార అతడికి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తే ఆ ఉద్యోగం పోతుంది. కాబట్టి వాళ్లకు భరోసా కల్పిస్తే.. ఎవరైనా బాహాటంగా మాట్లాడతారు' అని పఠాన్ వివరించాడు.

2012లో చివరిసారి టీమిండియాకు ఆడాడు:
ఇర్ఫాన్ 2003లో టీమిండియాకు ఎంపికై.. ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడాడు. తర్వాత పాకిస్థాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఒక్కసారిగా హీరో అయ్యాడు. బ్యాట్‌తోనూ పలు సందర్భాల్లో మంచి పరుగులు సాధించాడు. భారత్ తరఫున 29 టెస్టులాడిన ఇర్ఫాన్ 100 వికెట్లు తీశాడు. 120 వన్డేల్లో 173 వికెట్లు పడగొట్టాడు. 2012లో చివరిసారి టీమిండియాకు ఆడిన ఇర్ఫాన్.. తర్వాత జమ్మూ కశ్మీర్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో కొనసాగాడు. చివరకు ఈ ఏడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

హ్యాట్రిక్‌తో సంచలనం:
2006లో పాకిస్థాన్‌లో టీమిండియా పర్యటన. టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు 'డ్రా' అయ్యాయి. బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో ఏ జట్టు గెలువలేకపోయింది. బౌలర్లకు ఏ మాత్రం సహకరించడం లేదని పిచ్‌లపై రెండు జట్లు అసంతృప్తిగానే ఉన్నాయి. అయితే కరాచీలో జరిగిన మూడో టెస్టు తొలి ఓవర్‌తోనే సీన్ మారిపోయింది. పఠాన్ ఏకంగా హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు. సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మొహమ్మద్ యూసఫ్ టాప్ బ్యాట్స్‌మన్‌ల వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications