Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యూసఫ్‌తో గొడవ.. పోలీసు కేసు వరకు వెళ్లిన ఇర్ఫాన్ పఠాన్

ఇద్దరు సోదరుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అనుబంధం ఎలా ఉండాలో భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ తమ జీవిత కథతో నిరూపించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ పంచుకున్న బాల్యపు జ్ఞాపకాలు వారి సోదర ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తన అన్నయ్య యూసఫ్‌కు జరిగిన గొడవ గురించి తెలిసినప్పుడు. దాని కారణం గురించి ఆలోచించకుండా ఎలా స్పందించాడో ఇర్ఫాన్ వెల్లడించాడు.

సోదరుడి కోసం పోలీసు కేసును కూడా లెక్క చేయలేదు..
ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. "మీరు బాల్యంలో ఎప్పుడైనా గొడవపడ్డారా? అనే ప్రశ్నకు ఇర్ఫాన్ ఇలా సమాధానమిచ్చారు.

"ఒకసారి మా మాండవి నగర్ ప్రాంతం మా అన్నయ్యకు ఓ వ్యక్తితో గొడవ జరిగింది. కోపంతో, చిరిగిపోయిన బట్టలతో ఆయన ఇంటికి రావడం చూసి నేను ఏ మాత్రం ఆలోచించలేదు. నేను వెంటనే పరుగు పరుగున వెళ్లి, మేమిద్దరం కలిసి ఆ వ్యక్తిని దారిలోనే చితక్కొట్టాం. అప్పుడు మా వయసు కేవలం 10-12 సంవత్సరాలు ఉంటుంది. అదృష్టవశాత్తూ, ఆ వ్యక్తి తండ్రి మా నాన్నకు మంచి స్నేహితుడు కావడంతో పోలీసు కేసు లేకుండా తప్పించుకున్నాము. లేకపోతే ఆ రోజు కేసు అయ్యేది" అని ఇర్ఫాన్ చెప్పుకొచ్చారు.

Irfan Pathan Recalls Beating Up a Guy for Brother Yusuf Didn t Even Ask Why

యాంకర్ గొడవకు కారణం ఏమిటని అడిగినప్పుడు, ఇర్ఫాన్ వెంటనే, "సార్, కారణం ముఖ్యం కాదు. మా అన్నయ్యకు గొడవ అయింది. అంతే. ఏది కరెక్ట్, ఏది తప్పు అని అడగాల్సిన అవసరం లేదు. మా అన్నయ్య రమ్మంటే, మేము వెళ్లాల్సిందే. కొన్నిసార్లు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు" అని స్పష్టం చేశారు. ఈ మాటలు వారిద్దరి మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని తెలియజేస్తాయి.

ఒకరి కోసం ఒకరు.. ప్రాణం అడిగినా ఇస్తారు..
ఇర్ఫాన్ పఠాన్ తమ బంధం గురించి మరింత లోతుగా మాట్లాడుతూ.. "నా జీవితంలో నేను చాలా ఒడిదుడుకులను చూశాను. చాలా మంది స్నేహితులు నా జీవితంలోకి వచ్చి వెళ్లిపోయారు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడూ నా పక్కన స్థిరంగా ఉన్నాడు. అతడే నా సోదరుడు. ఆయన నా సోదరుడు కాదు.. నా ప్రాణం. నా ప్రాణాన్ని అడిగినా నేను ఇస్తాను. అలాగే నాకు ఏదైనా అవసరమని ఆయనకు తెలిస్తే, నన్ను ఎప్పుడూ అడగడు అని నాకు తెలుసు" అని భావోద్వేగంతో చెప్పారు.

ఆర్థిక విషయాల్లో కూడా వారిద్దరి మధ్య ఉన్న నమ్మకం గురించి ఇర్ఫాన్ పఠాన్ తెలిపారు. "నేను 100 రూపాయలు సంపాదిస్తే, అందులో 50 రూపాయలు నా సోదరుడికి చెందుతుంది. అదే విధంగా నా సోదరుడు 100 సంపాదిస్తే చెప్పకుండానే 50నాకు ఇచ్చేస్తాడు. ఈ వ్యవస్థ మా ఇంట్లో నడుస్తుంది, దాని తాళం మా నాన్నగారి వద్ద ఉంది" అని వివరించారు.

క్రికెట్ కెరీర్ గురించి మాట్లాడితే.. ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ ఇద్దరూ 2007 టీ-20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు విజయం సాధించిపెట్టారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, ఇర్ఫాన్ కామెంటరీ, బ్రాడ్‌కాస్టింగ్‌లో రాణిస్తుంటే.. యూసఫ్ పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరు సోదరులు తమ వృత్తిపరమైన జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఒకరికొకరు తోడుగా నిలబడడం అందరికీ స్ఫూర్తినిస్తోంది.

Story first published: Wednesday, August 20, 2025, 11:14 [IST]
Other articles published on Aug 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+