రెస్ట్ ఇచ్చినంత మాత్రాన పొడిచేస్తారనేది మీ భ్రమ.. సెలెక్షన్ కమిటీపై ఇర్ఫాన్ పఠాన్ మండిపాటు
జులై 22నుంచి వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ 16మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్లకు చోటు కల్పించకుండా వారికి మరోసారి బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. దీంతో శిఖర్ ధావన్ ఈ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలాగే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక జులై 7నుంచి 17వరకు ఇంగ్లాండ్‌తో వన్డేలు, టీ20ల సిరీస్‌లు ఇండియా ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌ల అనంతరం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఇక ట్రినిడాడ్‌లో జూలై 22 నుండి జూలై 27వరకు 3మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను వెస్టిండీస్‌తో భారత్ ఆడనుంది.

సెపరేటుగా ప్రిపేర్ అయినా గెలవలేకపోయారు
ఇక ఫిక్స్‌డ్ షెడ్యూల్ల వల్ల భారత జట్టు ఎంపికలో స్థిరత్వం కన్పించడం లేదు. ముఖ్యంగా, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్లు ఒక సిరీస్లో ఉంటే.. మరో సిరీస్లో ఉండట్లేదు. జూన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు, జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో జరిగిన 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కి వీరు దూరమయ్యారు. బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్డ్ చేసిన అయిదో టెస్ట్ కోసం సెపరేటుగా ప్రిపెర్ అయినా గెలవలేకపోయారు. ఇకపోతే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రాతో సహా టెస్ట్ జట్టులో ఉన్న సభ్యులు జులై 7న జరగబోయే తొలి టీ20కి కూడా అందుబాటులో ఉండరు. దీంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 టీం ఆడబోతుంది.

సెలెక్షన్ విధానంపై విరుచుకుపడ్డ పఠాన్
ఇక భారత టీం సెలక్షన్ విధానం పట్ల భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర ఆక్షేపణలు చేశాడు. సోషల్ మీడియా ద్వారా సెలెక్షన్ పాలసీపై విరుచుకుపడ్డాడు. ఆటగాళ్లు విశ్రాంతి తీసుకుంటే ఫామ్‌లోకి వస్తారనేది భ్రమ మాత్రమేనని తేల్చిపారేశాడు. ఇక పఠాన్ ట్వీట్ చేస్తూ.. 'విశ్రాంతి తీసుకుంటే ఎవరూ తిరిగి ఫామ్‌లోకి రారు' అని పఠాన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇక పఠాన్ ట్వీట్‌ను సమర్థిస్తూ ప్రేక్షకులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే సీనియర్లకు రెస్టులు ఎక్కువయ్యాయి. వాళ్లను బద్ధకస్తులుగా మార్చేయొద్దు అంటూ కామెంట్లలో పేర్కొంటున్నారు. ఇక వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ తర్వాత టీ20 సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇక టీ20 సిరీస్ కోసం సీనియర్, స్టార్ ఆటగాళ్లు జట్టులోకి చేరే అవకాశముంది.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications