T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 సమరం నేడు(ఫిబ్రవరి 7) ఘనంగా ప్రారంభం కాబోతోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో అందరి కళ్లు భారత్-పాక్ పోరుపైనే ఉన్నాయి. అయితే రాజకీయ కారణాలతో భారత్‌తో మ్యాచ్‌ను బహిస్తారిస్తామన్న పాకిస్థాన్ ప్రకటన క్రీడా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ వివాదంపై టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో స్పందించారు.
పాకిస్థాన్ వెనక్కి తగ్గక తప్పదు
పాకిస్థాన్ ప్రభుత్వం ప్రస్తుతం భారత్‌తో మ్యాచ్ ఆడబోమని చెబుతున్నప్పటికీ.. అది కేవలం తాత్కాలికమేనని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. ఐసీసీ నిబంధనల ప్రకారం టోర్నీలో నచ్చిన జట్లతోనే ఆడటంపై అవకాశం లేదని.. ఇలా చేస్తా పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై భారీ జరిమానాలు లేదా నిషేధం విధించే ప్రమాదం ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ ఒత్తిడి కారణంగా పాక్ చివరి నిమిషంలో ఖచ్చితంగా యూ-టర్న్ తీసుకుని మైదానంలోకి దిగుతుందని జోస్యం చెప్పారు.

భారత్‌ను ఢీకొనే సత్తా ఉందా?
పాకిస్థాన్ ఒకవేళ ఆడేందుకు ఒప్పుకున్నా ప్రస్తుత భారత్ జట్టును ఎదుర్కోవడం వారికి అంత సులభం కాదని ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించారు. 2025 ఆసియా కప్‌లో భారత్ వరుసగా మూడుసార్లు పాకిస్థాన్‌ను చిత్తు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. "గ్రూప్ స్టేజ్‌లో టీమిండియాకు అసలు సవాళ్లే లేవు. గత రికార్డులు చూస్తే పాక్ జట్టు భారత్‌పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మైదానంలో టీమిండియాదే పూర్తి ఆధిపత్యం" అని ఆయన తన యూట్యూబ్ ఛానల్‌లో స్పష్టం చేశారు.
నేడు ప్రారంభం కానున్న మెగా పోరు
వరల్డ్ కప్ తొలి రోజైన శనివారం మూడు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి.
*మొదటి మ్యాచ్: కొలంబో వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో తలపడనుంది.
*రెండో మ్యాచ్: కోల్‌కతాలో వెస్టిండీస్, స్కాట్లాండ్‌లు పోటీపడతాయి.
*మూడో మ్యాచ్: ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా మధ్య జరగనుంది.
షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ జరగాలి. ఒకవేళ పాక్ రాకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్‌కు 'వాక్ ఓవర్' ద్వారా 2 పాయింట్లు లభిస్తాయి. కానీ క్రికెట్ అభిమానులు మాత్రం దాయాదుల మధ్య హోరాహోరీ పోరు కోసమే ఎదురుచూస్తున్నారు.