For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వేలంలో అమ్ముడుపోని పఠాన్: ఫ్యాన్స్‌కు ఎమోషనల్ లెటర్

సోమవారం (ఫిబ్రవరి 20) బెంగుళూరులో ఐపీఎల్ 2017 కోసం నిర్వహించిన వేలంలో తనను కోనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపక పోవడంపై టీమిండియా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ కాస్తంత ఉద్వేగానికి లోనయ్యాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: సోమవారం (ఫిబ్రవరి 20) బెంగుళూరులో ఐపీఎల్ 2017 కోసం నిర్వహించిన వేలంలో తనను కోనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపక పోవడంపై టీమిండియా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ కాస్తంత ఉద్వేగానికి లోనయ్యాడు.

2007లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఇర్ఫాన్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఈ క్రమంలో టీమిండియాలోకి రావడానికి తాను ఎంత కష్టపడ్డాడో, తీవ్రమైన సమస్యలను తాను ఎలా అధిగమించాడో ట్విట్టర్ ద్వారా అభిమానులకు ఓ లేఖ ద్వారా తెలియజేశాడు.

'2010లో ఐదు ఫ్రాక్చర్స్ అయితే క్రికెట్ ఇక జీవితంలో క్రికెట్ ఆడలేవని ఫిజియో, ట్రైనర్ నాకు చెప్పారు. వీలైనంత ఎక్కువ కాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడమే నా డ్రీమ్. అలాంటిది ఫిజియో మాటలకు ఎంతో కలవరపడ్డాను. ఎంత నొప్పి, బాధనైనా భరిస్తాను.. కానీ టీమిండియాకు ఆడకుండా ఉండలేనని ఫిజియోను తేల్చి చెప్పేశాను.

Irfan Pathan posts emotional letter to his fans on Twitter after IPL 2017 snub

క్రికెట్ మళ్లీ ఆడేందుకు మాత్రమే కష్టపడలేదు. భారత జట్టులో మళ్లీ అవకాశం కోసమే కెరీర్లో, జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రస్తుతం నా ముందు మరో సమస్య ఉంది. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశలను వదులుకోలేను. చాలా మంది అభిమానులు నాకు మద్దతుగా నిలిచారు' అంటూ ఇర్ఫాన్ పఠాన్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు.

టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న ఇర్ఫాన్ పఠాన్ ఈ మధ్య కాలంలో దేశవాళీ టోర్నీల్లో సైతం సత్తా చాటుతున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లాడిన ఇర్ఫాన్ పఠాన్ 6.28 యావరేజితో నాలుగు వికెట్లు తీసుకున్నాడు.

ఐపీఎల్ వేలంలో ఇర్ఫాన్ పఠాన్ కనీస ధరను రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. అయితే రెండు సెషన్లలో కూడా ప్రాంఛైజీలు ఇర్ఫాన్ పఠాన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఒక్క ప్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అయితే టోర్నీ మధ్యలో ఎవరైనా ఆటగాళ్లు గాయపడితే ఇర్ఫాన్‌ను ఏదైనా ఫ్రాంచైజీ తీసుకునే అవకాశం ఉంది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+