Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రా 'బేబి బౌలర్' అన్న అబ్దుల్ రజాక్‌కు ఇర్ఫాన్ పఠాన్ సూపర్ పంచ్!

 Irfan Pathan hits out at Abdul Razzaq for calling Jasprit Bumrah a baby bowler

హైదరాబాద్: కెప్టెన్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్‌ బుమ్రాను విమర్శించిన పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్‌ రజాక్‌కు టీమిండియా వెటరన్ పేసర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ తనదైన శైలి పంచ్ ఇచ్చాడు. ఇర్పాన్ పఠాన్ మాట్లాడుతూ "ఇర్ఫాన్‌ లాంటి బౌలర్‌ వారి గల్లీలో ఎంతో మంది ఉంటారు. కానీ ఆ గల్లీ బౌలర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేక వారు పెవిలియన్‌కు చేరుతారు" అని అన్నాడు.

"వారు చేసే చెత్త కామెంట్లను పట్టించుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను. కేవలం చదివేసి, నవ్వి వదిలేయండి" అంటూ ఇర్ఫాన్‌ ట్వీట్‌ చేశాడు. 2004లో పఠాన్‌ను ఉద్దేశించి మియాందాద్‌ సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇర్ఫాన్‌ లాంటి బౌలర్‌ వారి గల్లీలో ఎంతో మంది ఉంటారని అతడు విమర్శించాడు.

"పఠాన్‌ చెడ్డ బౌలర్‌ అని చెప్పట్లేదు. అతడు భారత్‌కు సరిపోతాడు. కానీ పాక్‌ బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టలేడు. షోయబ్‌ అక్తర్‌, మహ్మద్‌ సమి భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తారు, కానీ పఠాన్‌ అలా చేయలేడు" అని మియాందాద్‌ అన్నాడు. ఆ తర్వాత పాక్‌ పర్యటనలో ఇర్ఫాన్‌ 20 వికెట్లు తీసి సత్తా చాటాడు.

అంతేకాకుండా 2006లో పాక్‌పై హ్యాట్రిక్‌ సాధించి సంచలన ప్రదర్శన చేశాడు. భారత్‌ తరఫున హ్యాట్రిక్‌ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మియాందాద్‌ తరహాలో రజాక్‌ కూడా ఇప్పుడు భారత బౌలర్లను విమర్శించడంతో పఠాన్‌ అప్పటి వ్యాఖ్యలను వారికి గుర్తు చేస్తూ అతడికి చురకలంటించాడు.

ఓ 'బేబి బౌలర్'

ఓ 'బేబి బౌలర్'

పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన ముందు ఓ 'బేబి బౌలర్' అంటూ పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ సోషల్ మీడియాలో నవ్వులు పాలయ్యాడు. సుదీర్ఘకాలం పాక్‌కు ప్రాతినిథ్యం వహించిన తాను వరల్డ్‌ క్లాస్‌ బౌలర్లను ఎదుర్కొన్నాననీ.. అందులో గ్రేట్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, వసీమ్‌ అక్రమ్‌ లాంటి వారు ఉన్నారన్నారని అన్నాడు.

వారితో పోలిస్తే

అయితే, వారితో పోలిస్తే బుమ్రా తన ముందు ఓ బేబీ బౌలర్‌ని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో అబ్దుల్ రజాక్‌ను విపరీతంగా ట్రోల్‌ కూడా చేశారు. రజాక్‌ బుమ్రాపై చేసిన వ్యాఖ్యలు జోక్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అని, రజాక్‌ ప్రపంచంలోనే అత్యంత భయంకర బౌలరని విమర్శలు గుప్పించారు.

 క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో

క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో

తాజాగా క్రికెట్ పాకిస్థాన్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ "గ్లెన్ మెక్‌గ్రాత్, వసీం అక్రమ్ లాంటి దిగ్గజ బౌలర్లతో కలిసి ఆడాను. నా ముందు బుమ్రా బేబి బౌలర్. నేను అతడిపై సులభంగా ఆధిపత్యం చెలాయించి పరుగుల వరద పారించేవాడిని" అని చెప్పుకొచ్చాడు.

 ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న

ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న

"నా కాలంలో ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న తరువాత, బుమ్రా వంటి బౌలర్‌పై నాకు ఎటువంటి సమస్య ఉండేది కాదు. అతనిపైనే ఒత్తిడి ఉండేది. బుమ్రా చాలా బాగా రాణిస్తున్నాడు. చాలా మెరుగయ్యాడు కూడా. అతడి యాక్షన్ భిన్నంగా ఉంటుంది. సీమ్‌ను ఖచ్చితంగా ఉంటుంది కాబట్టే అతను ప్రభావవంతమైన ఆటగాడు కాగలిగాడు" అని రజాక్ అన్నాడు.

శుక్రవారం బుమ్రా 26వ పుట్టినరోజు

శుక్రవారం 26వ పుట్టినరోజుని జరుపుకుంటున్న జస్ప్రీత్ బుమ్రాకు ముంబై ఇండియన్స్ యాజమాన్యం వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తన ట్విట్టర్‌లో "బేబి బౌలర్ టు వరల్డ్ బీటర్" అంటూ బుమ్రా యువకుడిగా ఉన్న ఫోటోలను పోస్టు చేసింది.

Story first published: Saturday, December 7, 2019, 8:12 [IST]
Other articles published on Dec 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+