For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈ పరిస్థితుల్లో ఆరో బౌలర్ ఉండుంటేనా..! ఇర్ఫాన్ పఠాన్

ICC Cricket World Cup 2019 : IND V NZ : Irfan Pathan Concern Over India’s Sixth Bowling Option !
Irfan Pathan expresses concern over India’s lack of sixth bowling option against New Zealand

మాంచెస్ట‌ర్‌: ప్ర‌పంచ‌క‌ప్ తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్ సంద‌ర్భంగా ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని తుదిజ‌ట్టులోకి తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల చెల‌రేగిన విమ‌ర్శ‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా- ఈ విమ‌ర్శ‌కుల జాబితాలో టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ కూడా చేరిపోయారు. మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని తుది జ‌ట్టులోకి తీసుకుని ఉంటే.. న్యూజిలాండ్ జ‌ట్టు 200 ప‌రుగులను అధిగ‌మించ‌లేక‌పోయి ఉండేద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

శ్లాగ్ ఓవ‌ర్ల‌లో ష‌మీ అద్భుతంగా బౌల్ చేయ‌గ‌ల‌డ‌ని అన్నారు. తొలి సెమీఫైన‌ల్ రెండో రోజు న్యూజిలాండ్ ఇంకా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. ఆ జ‌ట్టు ఇంకా 23 బంతుల‌ను ఎదుర్కోవాల్సి ఉంది. ఈ ప‌రిస్థితుల్లో ష‌మీని తీసుకుని ఉంటే- కివీస్‌ను క‌ట్టిప‌డేసే వాడ‌ని ఇర్ఫాన్ ప‌ఠాన్ చెబుతున్నారు.దీనికితోడు- స్పిన్న‌ర్ కుల్‌దీప్ యాద‌వ్‌ను కూడా తీసుకోక‌పోవ‌డం స‌రికాద‌ని అన్నారు. కుల్‌దీప్ యాద‌వ్‌కు న్యూజిలాండ్‌పై మంచి ట్రాక్ రికార్డు ఉంద‌ని, కివీస్ బ్యాట్స్‌మెన్ల‌పై ఒత్తిడిని తీసుకుని రాగ‌లిగే స‌త్తా అత‌నికి ఉంద‌ని చెప్పారు. త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డిస్తూ ఓ ట్వీట్ చేశారు ప‌ఠాన్‌.

అయిదుమంది బౌల‌ర్ల‌ను కొన‌సాగిస్తూనే.. ఆరో బౌల‌ర్‌కు కూడా చోటు క‌ల్పించి ఉండాల్సింద‌ని అన్నారు. ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్య గ‌జ్జ‌ల్లో గాయం వ‌ల్ల బౌలింగ్ ఆశించిన స్థాయిలో వేయ‌ట్లేద‌ని, ఈ లోటును ఆరో బౌల‌ర్ భ‌ర్తీ చేసి ఉండేవాడ‌ని అన్నారు. పాండ్య గాయం తీవ్ర‌మైన‌ది కాక‌పోయిన‌ప్ప‌టికీ..అత‌నిపై బౌలింగ్ ఒత్తిడి ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని చెప్పారు. ఫాస్ట్ బౌల‌ర్ గాయాల బారిన ప‌డ‌టం అత్యంత స‌హ‌జ‌మ‌ని అన్నారు.

Story first published: Wednesday, July 10, 2019, 12:14 [IST]
Other articles published on Jul 10, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+