పొల్లార్డ్ ఈగోను దెబ్బకొట్టిన ధోనీ: 2010 ఐపీఎల్ ఫైనల్ హిస్టరీ రిపీట్

ముంబై: ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. సూపర్‌గా గెలిచింది. చివరి బంతి వరకు హైటెన్షన్‌గా సాగిన ఈ పోరులో మహేంద్ర సింగ్ ధోనీ మేజిక్ చేశాడు. తనదైన స్టైల్‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. తన బ్రాండ్ షాట్స్‌ను చూపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ గెలిచిందంటే ధోనీ వల్లే సాధ్యమైంది. అదే సమయంలో పరోక్షంగా కేప్టెన్సీ బాధ్యతలను కూడా వహించాడు. ఫీల్డింగ్‌ను సెట్ చేస్తూ కనిపించాడు.

ధోనీ షాడో కేప్టెన్సీ..
ఈ మ్యాచ్‌లో ధోనీ ఆల్‌రౌండర్ సత్తా చాటాడు. బ్యాటర్‌గా జట్టును గెలిపించడానికే అతను పరిమితం కాలేదు. వికెట్ల వెనక ఉండి కథను నడిపించాడు. షాడో కేప్టెన్‌గా పని చేశాడు. ఇన్ని సంవత్సరాలుగా ఎల్లో ఆర్మీకి నాయకత్వాన్ని వహిస్తూ వచ్చిన ధోనీ తొలిసారిగా తన కేప్టెన్సీ వదులుకున్న విషయం తెలిసిందే. ధోనీ స్థానంలో మరో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ జట్టుకు సారధ్య బాధ్యతలను తీసుకున్నప్పటికీ.. ఆ భారాన్ని ధోనీ మోస్తున్నట్టే.

పొల్లార్డ్ కోసం..
బిగ్ ఫిష్ కీరన్ పొల్లార్డ్ కోసం ధోనీ వల విసిరిన విధానం.. అతని అనుభవానికి అద్దం పట్టింది. ఎనిమిది బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్‌తో 14 పరుగులు చేసి.. ప్రమాదకరంగా కనిపించిన పొల్లార్డ్‌ను అవుట్ చేయడానికి ధోనీ ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఫీల్డింగ్ సెట్ చేసిన మరుసటి బంతికే అతను అవుట్ అయ్యాడు. ధోనీ అంచనాలు ఏ మాత్రం తప్పలేదు.. తప్పు కాలేదు. తాను ఫీల్డర్లను అలర్ట్ చేసిన ఆ తరువాతి బంతికి పొల్లార్డ్ పెవిలియన్ దారి పట్టాడు.

ఫీల్డింగ్ చేసిన ధోనీ.. చిక్కుకున్న పొల్లార్డ్..
17వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహీష్ తీక్షణ సంధించిన ఓవర్ అది. ఆ ఓవర్ తొలి బంతికి తిలక్ వర్మ సింగిల్ తీశాడు. స్ట్రైకింగ్ ఎండ్‌లోకి పొల్లార్డ్ చేరుకున్న తరువాత ధోనీ తమ బ్రెయిన్‌కు పని చెప్పాడు. పొల్లార్డ్ ఎలాంటి షాట్ ఆడతాడో ముందుగానే పసిగట్టాడు. దానికి అనుగుణంగా ఫీల్డింగ్ సెట్ చేశాడు. ఆఫ్ సైడ్ ప్లేయర్లను కాస్త దూరంగా వెళ్లాలంటూ సైగ చేశాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న ఫీల్డర్లనూ అలర్ట్ చేశాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేయాలంటూ సూచించాడు.

పొల్లార్డ్ ఈగో షాట్..
తన కోసం ధోనీ వల పన్నడాన్ని పొల్లార్డ్ కాస్త సీరియస్‌గానే తీసుకున్నాడు. ఈగోగా ఫీలయ్యాడు. తన ఈగోను దెబ్బకొట్టడాన్ని సహించలేకపోయాడు. ఆ ఆవేశంతోనే తీక్షణ సంధించిన షార్ట్ లెంగ్త్ బంతిని లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడాడు పొల్లార్డ్. అది కాస్త నేరుగా వెళ్లి శివం దుబే చేతుల్లో వాలింది. బంతి గాల్లోకి లేచిన మరుక్షణమే అది ఎక్కడ ల్యాండ్ అవుతుందో గ్రహించాడు పొల్లార్డ్. శివం దుబే దాన్ని అందుకోకముందే.. క్రీజ్‌ను వదిలాడు.
స్ట్రెయిట్ డ్రైవ్ ఆడటానికే ఇష్టపడతాడు..
పొల్లార్డ్ ఎప్పుడూ.. స్ట్రెయిట్ డ్రైవ్ ఆడటానికే ఇష్టపడతాడని, దాన్ని ఆధారంగా చేసుకుని ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్‌ను సెట్ చేశాడనీ విశ్లేషించాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. స్ట్రెయిట్ షాట్ ఆడొద్దంటూ నాన్ స్ట్రైకర్ ఎండ్ బ్యాటర్ సూచించినప్పటికీ.. వినిపించుకోలేదని, దీనికి కారణం అతని ఈగో హార్ట్ కావడమేనని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో ఈగోను పక్కన పెట్టక తప్పదనీ వ్యాఖ్యానించాడు. ఈ షాట్ ద్వారా తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశాడని, సక్సెస్ కాలేకపోయాడని ఇర్ఫాన్ స్పష్టం చేశాడు.

ఫీల్డ్ సెట్టింగ్ కొత్తేమీ కాదు..
పొల్లార్డ్ కోసం ఫీల్డింగ్‌ను ధోనీ సెట్ చేయడం ఇది కొత్తేమీ కాదని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. ఇదివరకు కూడా ఇలాంటి ఫీల్డింగ్ వలను పన్నాడని గుర్తు చేశాడు. 2010లో ఫైనల్ మ్యాచ్‌లో కూడా మాథ్యూ హెడెన్‌తో ఫీల్డింగ్‌ను సెట్ చేశాడని, అది సక్సెస్ అయిందని ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేశాడు. ఫీల్డర్ లాంగ్‌ఆన్‌లో ఉన్నప్పటికీ.. బంతి బ్యాట్ మధ్యలో తగిలితే చాలని పొల్లార్డ్ అనుకున్నాడని, టైమింగ్ మిస్ కావడంతో పొలార్డ్ మూల్యం చెల్లించుకున్నాడని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications