కరీబియన్ లీగ్‌కు పఠాన్.. రికార్డు సృష్టిస్తాడా?

వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రిమియర్ లీగ్ (సీపీఎల్)లో ఆడేందుకు భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే పఠాన్ దరఖాస్తు కూడా చేసుకున్నాడు. గురువారం ప్రకటించిన సీపీఎల్ ఆటగాళ్ల జాబితాలో ఇర్ఫాన్ చోటు కూడా దక్కించుకున్నాడు.

రికార్డు సృష్టిస్తాడా?:
ఇక ఏ జట్టు యాజమాన్యం అయినా సరే పఠాన్‌ను తీసుకుంటే.. సీపీఎల్‌లో ఆడిన తొలి భారత ఆటగాడిగా ఇర్ఫాన్ గుర్తింపు పొందనున్నాడు. మరి ఇర్ఫాన్ ఈ రికార్డు సృష్టిస్తాడా? అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ లీగ్‌లో ఆడాలంటే ఇర్ఫాన్‌కు బీసీసీఐ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. పఠాన్‌తో పాటు ఈ లీగ్‌లో ఆడేందుకు అలెక్స్ హేల్స్, రషీద్ ఖాన్, షకిబుల్ హాసన్, జొఫ్రా ఆర్చర్, జేపీ డుమినీలు కూడా దరఖాస్తు చేసుకున్నారు.

భారీగా విదేశీ దరఖాస్తులు:
ఐపీఎల్ మాదిరిగానే ఈ సీపీఎల్ కూడా మంచి ఆదరణ పొందింది. విండీస్ ప్రతి ఆటగాడు ఈ లీగ్‌లో ఆడుతున్నారు. ఐపీఎల్ లాగానే లీగ్‌లోని ప్రతి ఫ్రాంచైజీకి తమ పాత ఆటగాళ్లను అంటిపెట్టుకొని ఉండే అవకాశం ఉంది. సెప్టెంబర్ 4 నుంచి అక్టోబర్ 12 వరకు ఈ లీగ్ జరగనుంది. లీగ్‌లో ఆడేందుకు ఇప్పటికే 536 మంది విదేశీ ఆటగాళ్లు దరఖాస్తులు చేసుకున్నారు.

చివరిసారిగా 2017లో:
2018, 2019 ఐపీఎల్ సీజన్లలో ఇర్ఫాన్ పఠాన్ ఆడలేదు. చివరిసారిగా 2017లో గుజరాత్ లయన్స్‌కు పఠాన్ ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2016లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌కు ఆడాడు. మరోవైపు ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు యూసుఫ్ పఠాన్ హైదరాబాద్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications