ఐపీఎల్లో బెస్ట్ ప్లేయింగ్ 11ను ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్, కెప్టెన్ ఎవరంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ ఎడిషన్ అలరించింది. రెండు కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో అరంగేట్రం చేశాయి. కొత్త జట్లు అయినప్పటికీ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించి సత్తా చాటాయి. ఇకపోతే గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచి సగర్వంగా ఐపీఎల్ ట్రోఫీ అందుకుంది. ఇక ఈ సీజన్‌లో కొంతమంది అగ్రశ్రేణి ఆటగాళ్ల నుంచి అద్భుతమైన ప్రదర్శనలొచ్చాయి. మరికొందరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఈ సీజన్లో తమ ఆటతీరుతో వెలుగులోకి వచ్చారు. ఈ సీజన్‌లోని అత్యుత్తమ ప్లేయర్లతో కూడా ప్లేయింగ్ ఎలెవన్ టీంను మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

టాపార్డర్లో బట్లర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ ఎందుకంటే?
పఠాన్ పేర్కొన్న ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ 11టీంలో జోస్ బట్లర్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా ఉన్నారు. ఇకపోతే ఈ సీజన్‌లో నాలుగు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలతో 863పరుగులతో జోస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్ సాధించిన సంగతి తెలిసిందే. ఇకపోతే కేఎల్ రాహుల్ అత్యధికపరుగులు చేసినవారి జాబితాలో 616పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. రాజస్థాన్ ఫైనల్స్‌కు చేరుకోవడంలో, లక్నో ప్లేఆఫ్ వరకు చేరుకోవడంతో ఈ ఇద్దరు ఓపెనర్ల పాత్ర ఎంతో కీలకం. ఇక రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను పఠాన్ నంబర్ 3వ స్థానంలో పేర్కొన్నాడు. రాజస్థాన్ ఫైనల్స్‌లోకి చేరేలా సంజూ తన జట్టును నడిపించాడు. సంజూ క్రీజులో ఉన్నంత సేపు ధాటిగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తాడు. అతను 17గేమ్‌లలో కేవలం రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే సాధించినా.. అతను జట్టు విజయం కోసం కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.

మిడిలార్డర్లో పవర్ హిట్టర్లు
పఠాన్ పేర్కొన్న ప్లేయింగ్ 11 మిడిల్ ఆర్డర్ బ్యాటర్లలో ఐపీఎల్ 2022 విజేత కెప్టెన్ హార్దిక్ పాండ్యా, పంజాబ్ కింగ్స్ పవర్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్, గుజరాత్ ఫినిషర్ డేవిడ్ మిల్లర్‌లు ఉన్నారు. పాండ్యా తన జట్టును అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే టైటిల్ అందించిన సంగతి తెలిసిందే. ఇక పాండ్యాను తన టీం కెప్టెన్ గా పఠాన్ పేర్కొన్నాడు. అతను కీలకమైన ఆల్ రౌండర్ గా పేర్కొన్నాడు. లివింగ్‌స్టోన్, మిల్లర్‌లు ఫినిషర్ల పాత్రను పోషించడానికి సరైన ప్లేయర్లు అని పేర్కొన్నాడు.

బౌలింగ్ యూనిట్లో వీళ్లకు సాటి లేరు
గుజరాత్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ హర్షల్ పటేల్ రూపంలో పఠాన్ తన ప్లేయింగ్ 11లో ఇద్దరు బౌలింగ్ ఆల్-రౌండర్‌లను చేర్చుకున్నాడు. ఈ సీజన్‌లో రషీద్ 16మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టగా, పటేల్ 15 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో పటేల్ 7.66ఎకానమీతో బౌలింగ్ వేయగా రషీద్ 6.60ఎకానమీ కలిగి ఉన్నాడు. ఇద్దరూ జట్టుకు కీలకమైన వికెట్లను అందించగల ప్లేయర్లే. పఠాన్ బౌలింగ్ లైనప్‌లో పేసర్ మహ్మద్ షమీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్, రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (12వ ప్లేయర్)లు ఉన్నారు. షమీ ఈ సీజన్‌లో టైటాన్స్ తరఫున 20వికెట్లు పడగొట్టాడు.

పఠాన్ జట్టు
ఐపీఎల్ 2022లో ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్న అత్యుత్తమ ప్లేయింగ్ XI: జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ (12వ ఆటగాడు- కుల్దీప్ యాదవ్).
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications