Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏం ఛాన్స్ కొట్టాడురా.. 148 ఏళ్లలో తొలిసారి.. అరంగేట్ర మ్యాచ్‌లోనే కెప్టెన్‌గా..

జింబాబ్వే-ఐర్లాండ్ మ‌ధ్య ఏకైక టెస్టు మ్యాచ్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ సంచలనం నమోదైంది. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన ఓ క్రికెటర్.. తన తొలి మ్యాచ్ లోనే సారథిగా వ్యవహరించడం విశేషం.

అతడెవరంటే?
ఈ మ్యాచ్‌కు కొన్ని గంట‌ల ముందు రెగ్యుల‌ర్ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ మ్యాచ్ కు దూరమయ్యాడని అక్కడి క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే ఇదే సమయంలో ఈ మ్యాచ్ తో జింబాబ్వే దిగ్గజ క్రికెట‌ర్‌ అలస్టెయిర్ క్యాంప్‌బెల్ త‌న‌యుడు జోనాథన్ కాంప్‌బెల్ టెస్టు అరంగేట్రం చేశాడు. అతడే ఇప్పుడు త‌న అరంగేట్ర మ్యాచ్‌లోనే జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హరించే అవ‌కాశం దక్కించుకున్నాడు. అలా తన ఎంట్రీ మ్యాచ్ లోనే సారథ్య బాధ్యతలు అందుకున్న కాంప్‌బెల్.. ఓ అరుదైన ఘనతను కూడా వేసుకున్నాడు.

Ireland vs Zimbabwe Test Jonathan Campbell become second cricketer to captain the test side in debut match

గత 148 ఏళ్లలో.. జింబాబ్వే టెస్ట్ క్రికెట్ చరిత్రలో తండ్రి, కొడుకు.. ఇద్దరూ సారథులుగా వ్యవహరించిన తొలి ద్వయంగా నిలిచారు. మొత్తంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో తండ్రి, కొడుకు.. ఇద్దరూ సారథులుగా వ్యవహరించిన నాలుగో ద్వయంగానూ నిలిచారు.

ఇంకా అరంగేట్ర మ్యాచ్ లోనే జింబాబ్వే జట్టుకు టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికైన రెండో ప్లేయ‌ర్‌గా కాంప్‌బెల్ ఘనత సాధించాడు. అంతకుముందు దిగ్గ‌జ క్రికెట‌ర్ డేవ్ హౌటన్.. 1992లో హరారే వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన ఓ టెస్టు మ్యాచ్ లో జింబాబ్వే సార‌థిగా వ్య‌వ‌హ‌రించాడు. గత 50 ఏళ్లలో ఇలాంటి ఘతన అందుకున్న మూడో ప్లేయర్ గా నిలిచాడు.

21వ శతాబ్దంలో అరంగేట్రంలోనే టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ఐదో ప్లేయర్‌గానూ జోనాథన్ రికార్డు సాధించాడు. ఈ 21 శతాబ్దంలో అతడి కన్నా ముందు న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్‌ లీ జెర్మెన్ (1995లో), నైమూర్ రెహమాన్ (2000లో బంగ్లాదేశ్), విలియం పోర్టర్‌ఫీల్డ్ (2018లో), అస్గర్ ఆఫ్ఘన్ (2018లో) ఈ ఘనత సాధించారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మంచి రికార్డే
జోనాథన్ కు ఫస్ట్‌ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డే ఉంది. 34 ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు 1,913 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ 42 వికెట్లు తీశాడు.

Story first published: Thursday, February 6, 2025, 18:49 [IST]
Other articles published on Feb 6, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+