17 పరుగుల దూరంలో: మరో రికార్డు చేరువలో విరాట్ కోహ్లీ

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీసేన రెండు టీ20ల సిరిస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. బుధవారం ఐర్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆ రికార్డును విరాట్ కోహ్లీ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

టీ20 క్రికెట్‌లో మరో రికార్డుకి చేరువలో కోహ్లీ
వన్డేలు, టెస్టుల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులు అందుకున్న కోహ్లీ ఇప్పుడు టీ20 క్రికెట్‌లో మరో రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఐర్లాండ్‌తో జరిగే తొలి టీ20లో విరాట్ కోహ్లీ మరో 17 పరుగులు చేస్తే, టీ20ల్లో రెండు వేల పరుగులు మైలురాయిని అందుకుంటాడు. అంతేకాదు, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.

50.84 సగటుతో 1983 పరుగులు
54 టీ20 ఇన్నింగ్స్‌లాడిన విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 50.84 సగటుతో 1983 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు టీ20ల్లో రెండు వేల పరుగుల మైలురాయిని ఇప్పటికే ఇద్దరు క్రికెటర్లు అందుకున్నారు. ప్రస్తుతం టీ20 పరుగుల జాబితాలో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.

2271 పరుగులతో అగ్రస్థానంలో మార్టిన్ గుప్టిల్
న్యూజిలాండ్ ఆటగాళ్లు మారిన్ గుప్టిల్ (2271 పరుగులు) అగ్రస్థానంలో ఉండగా, బ్రెండన్ మెక్‌కల్లమ్ (2140) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ (1989) మూడో స్థానంలో ఉన్నాడు. కాగా, మెక్‌కల్లమ్ 66 ఇన్నింగ్స్‌లో, గప్టిల్ 68 ఇన్నింగ్స్‌లో 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో రెండు టీ20లు
ఇదిలా ఉంటే ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ20ల సిరీస్‌కు డబ్లిన్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం లండన్ నుంచి బయలుదేరి డబ్లిన్ చేరుకుంది. అనంతరం టీమిండియా ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications