Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ireland Tour of India: ఆ ఇద్దరు అరంగేట్రం చేయబోతున్నారు.. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హార్దిక్ పాండ్యా హింట్

Ireland Tour Of India: Hardik Pandya gave Hints On Debuts of Rahul Tripati and Umran Malik..?

ఐర్లాండ్ సిరీస్‌లో భారత జట్టు తరఫున ఇద్దరు ప్లేయర్లు అరంగేట్రం చేయబోతున్నారంటూ భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా సూచించాడు. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పాండ్యా మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు. 'మేము జట్టులో ఓ ఇద్దరికీ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అయినా అది ప్రయోగం కాదని. మా అత్యుత్తమ ప్లేయింగ్ 11ని ప్రతిబింబించేదేనని హార్దిక్ పేర్కొన్నాడు. ఇక ఇద్దరికీ జాతీయ జట్టు క్యాప్‌లు ఇవ్వడంతో పాటు అత్యుత్తమ ప్లేయింగ్ 11ని కలిగి ఉండేలా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని హార్దిక్ భాయ్ చెప్పాడు.

ప్లేయింగ్ 11ను మార్చని పంత్

ప్లేయింగ్ 11ను మార్చని పంత్

ఇకపోతే ఇటీవల ముగిసిన ఐదు టీ20 మ్యాచ్‌ల దక్షిణాఫ్రికా సిరీస్‌లో భారత్ తరఫున కొత్తగా ఎవరూ అరంగేట్రం చేయలేదు. పూర్తిగా అప్పటికే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వారే ఆడారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు రిషబ్ పంత్ కెప్టెన్సీ వహించిన సంగతి తెలిసిందే. ఇక తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయినప్పటికీ ప్లేయింగ్ 11ను మార్చకుండా రిషబ్ పంత్ కొనసాగించాడు.

దీంతో ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ లకు తుది జట్టులో ఛాన్స్ రాలేదు. ఇకపోతే ఐర్లాండ్ పర్యటనకు మొత్తం ముగ్గురు అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. రాహుల్ త్రిపాఠి సైతం ఐపీఎల్లో రాణించడంతో సెలెక్షన్ కమిటీ అతన్ని కూడా జట్టులోకి ఎంపిక చేసింది.

వాళ్లిద్దరికీ దాదాపుగా అవకాశం

వాళ్లిద్దరికీ దాదాపుగా అవకాశం

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హార్దిక్ పాండ్యా మాటలను బట్టి చూస్తే.. బౌలింగ్లో ఉమ్రాన్ మాలిక్, బ్యాటింగ్లో రాహుల్ త్రిపాఠి తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి. ఇక ప్లేయింగ్ 11ను కూడా చాలా పకడ్బందీగా హార్దిక్ ప్లాన్ చేయనున్నాడు. గుజరాత్ టైటాన్స్‌కు నాయకత్వం వహించిన మొదటి సంవత్సరంలోనే ఐపీఎల్ ట్రోఫీని అందించిన పాండ్యాకు ఈ సిరీస్ అసలైన పరీక్ష కాబోతుంది.

ఐర్లాండే కదా అని తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే గతంలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా లాంటి జట్లను ఓడించిన ఘనత ఐర్లాండ్‌ది. ఇకపోతే భవిష్యత్తులో పాండ్యా టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్ అవుతాడంటూ పలువురు క్రికెట్ ప్రముఖులు పేర్కొన్న సంగతి తెలిసిందే.

నేను ఎవరికీ ఏమీ చూపించాలనుకోవట్లేదు

నేను ఎవరికీ ఏమీ చూపించాలనుకోవట్లేదు

ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్‌గా మీ సత్తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నారా అని విలేకరులు అడగ్గా.. హార్దిక్ పాండ్యా స్పందిస్తూ.. నేను ఎవరికీ ఏమీ చూపించడానికి ఇక్కడికీ రాలేదని పేర్కొన్నాడు. నాకు భారత్‌కు నాయకత్వం వహించే గొప్ప అవకాశం వచ్చింది, అదే నాకు చాలా పెద్ద విషయం. ఎవరికీ ఏదైనా చూపించడానికి నేను క్రికెట్ ఆడను.

నేను నా వరకు తగినంత గేమ్ గెలవడానికి ఏదైనా చేయాలని చూస్తాను. అన్నింటికంటే ఈ సిరీస్‌లో ఎలాంటి ఫలితాన్ని తీసుకురావాలి అనే దానిపైనే నా దృష్టంతా ఉంది' అని పాండ్యా పేర్కొన్నాడు. ఇక రేపు ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆరంభం కానుంది.

ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు

ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు

హార్దిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ , అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్.

Story first published: Saturday, June 25, 2022, 21:38 [IST]
Other articles published on Jun 25, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+