
హైదరాబాద్: ఐసీసీలో పూర్తి స్థాయి మెంబర్‌గా చోటు దక్కించుకున్న తర్వాత ఐర్లాండ్ క్రికెట్ జట్టు టెస్టు క్రికెట్‌పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో తలపడనుంది. ఐర్లాండ్ జట్టుకి ఇది మూడో టెస్టు మ్యాచ్.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
అయితే, ఈ టెస్టు మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వబోతోంది. గతేడాది ఐసీసీ ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్‌కు ఒకేసారి టెస్టు హోదాను కల్పించిన సంగతి తెలిసిందే. ఆప్ఘనిస్థాన్ తన తొలి టెస్టుని గతేడాది టీమిండియాతో ఆడగా.... ఐర్లాండ్ డబ్లిన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌తో ఆడింది.
తన తొలి టెస్టులో పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైన ఐర్లాండ్... ఆ తర్వాత ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో మాత్రం విజయం సాధించింది. ఇప్పుడు మూడో టెస్టులో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు సిద్ధమైంది. వన్డే క్రికెట్‌లో ఐర్లాండ్ జట్టు ఇప్పటికే అనేక అద్భుతాలు చేసింది.
ముఖ్యంగా 2007 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధించిన ఐర్లాండ్... 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌నే కంగు తినిపించింది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఐర్లాండ్ ప్రదర్శన నిలకడగా ఉండటంతో టెస్టు హోదాను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు మ్యాచ్‌పై ఎన్నో అంచనాలతో బరిలోకి దిగుతోంది.
కాగా, త్వరలో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రారంభం కానున్న యాషెస్ టెస్టు సిరిస్‌కు ఇదొక సన్నాహాకంగా ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆగస్టు 1 నుంచి యాషెస్ సిరిస్ టెస్టు సిరిస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు మ్యాచ్‌కి ఎడ్జిబాస్టన్ ఆతిథ్యమిస్తోంది.