న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరుదైన సందర్భం: 2015 తర్వాత టీ20ల్లో తొలి తొలిసారి 'టై'

By Nageshwara Rao
Ireland and Scotland play thrilling tied match

హైదరాబాద్: టీ20ల్లో అరుదైన సందర్భం చోటు చేసుకుంది. ఐర్లాండ్‌లోని ఓయెస్టర్ ఓవల్ వేదికగా స్కాట్లాండ్‌-ఐర్లాండ్‌ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ ఓ అరుదైన రికార్డుని సాధించింది. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ సైతం 185 పరుగులకే పరిమితమైంది. దీంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. టీ20ల్లో 2015 తర్వాత ఓ మ్యాచ్‌ ఫలితం తేలకుండా టై ముగియడం ఇదే తొలిసారి.

మూడేళ్ల క్రితం ఇంగ్లాండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ చివరిసారి టైగా ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఆదివారం స్కాట్లాండ్‌-ఐర్లాండ్‌ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిసింది. ఆరు టీ20ల సిరిస్‌లో భాగంగా టాస్ గెలిచిన స్కాట్లాండ్‌ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

స్కాట్లాండ్‌ ఆటగాళ్లలోకోయిట్జర్‌(54) హాఫ్ సెంచరీతో రాణించగా... మెక్‌లీయాడ్‌(46), జార్జ్‌ మున్సే(46) ఫరవాలేదనిపించారు. దీంతో స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ తొలుత దూకుడుగా ఆడింది.

ఐర్లాండ్‌ ఓపెనర్‌ పాల్‌ స్టిర్లింగ్‌(81; 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే స్కాట్లాండ్‌ బౌలర్లు చివర్లో కట్టడిగా బౌలింగ్‌ చేయడంతో ఐర్లాండ్‌ విజయానికి పరుగు ముందు ఆగిపోయి, టైతో సరిపెట్టుకుంది.

Story first published: Monday, June 18, 2018, 11:25 [IST]
Other articles published on Jun 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X