For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Amy Hunter: మిథాలీ రికార్డు బద్దలు కొట్టిన ఐర్లండ్‌ బ్యాటర్‌ అమీ!!

Irelands Amy Hunter breaks Mithali Rajs record, becomes youngest batter to hit ODI century

హరారే: ఐర్లాండ్‌ మహిళా యువ క్రికెటర్‌ అమీ హంటర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. సోమవారం 16వ పడిలోకి ప్రవేశించిన హంటర్‌.. అంతర్జాతీయ వన్డేల్లో పిన్న వయసులో సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో హంటర్‌ అజేయ సెంచరీ (121 నాటౌట్‌)తో విజృంభించింది. తన కెరీర్‌లో నాలుగో వన్డే ఆడుతున్న ఈ యువ బ్యాటర్ 127 బంతుల్లో ఏడు బౌండరీల సాయంతో సెంచరీ చేసింది. అమీ ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ అద్భుతంగా ఆడింది. ఈ క్రమంలోనే అద్భుత భాగస్వామ్యాలు నెలకొల్పింది.

జింబాబ్వేపై అమీ హంటర్‌ సెంచరీ చేయడంతో భారత క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలైంది. 1999లో ఐర్లాండ్‌పై 16 ఏళ్ల 205 రోజుల వయసులో అజేయ సెంచరీ (114) చేసిన మిథాలీ రికార్డు తాజాగా చెరిగిపోయింది. మిథాలీ 16 ఏళ్ల 205 రోజుల్లో సెంచరీ చేయగా.. అమీ 16 ఏళ్లకే ఆ ఫీట్ అందుకుంది. గత మే నెలలో 15 ఏళ్ల వయసులో స్కాట్లాండ్‌పై హంటర్‌ వన్డే అరంగేట్రం చేసింది. 15 ఏళ్ల వయసులో ఐర్లాండ్‌ తరఫున అరంగేట్రం చేసిన హంటర్‌.. అనతికాలంలోనే స్టార్‌ క్రికెటర్‌గా ఎదిగింది. ఐర్లాండ్‌ జట్టులో ఇప్పటి వరకు వన్డేల్లో సెంచరీ చేసిన నాలుగో బ్యాటర్‌గా అమీ నిలిచింది.

ఈ అరుదైన ఫీట్‌ను అందుకోవడం చాలా సంతోషంగా ఉందని మ్యాచ్‌ అనంతరం ఐర్లాండ్‌ మహిళా యువ క్రికెటర్‌ అమీ హంటర్‌ పేర్కొంది. అద్భుత సెంచరీ చేసిన అమీకి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. జింబాబ్వేతో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 85 పరుగులతో నెగ్గింది. పురుషులకు సంబంధించి పిన్న వయస్సులో సెంచరీ చేసిన రికార్డు పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది (16 ఏళ్ల 217 రోజులు) పేరిట ఉంది. శ్రీలంకపై ఆఫ్రిది 102 రన్స్‌ సాధించాడు. అయితే ఆఫ్రిది తప్పుడు వయసు చూవుపిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో టాస్​ ఓడి బ్యాటింగ్​ దిగిన ఐర్లాండ్​ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 312 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అమీ హంటర్‌ (121; 127 బంతుల్లో 7x4) సెంచరీ చేయగా.. గాబీ లూయిస్ (78; 87 బంతుల్లో 10x4, 1x6), డెలాని (68; 53 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం బరిలో దిగిన జింబాబ్వే 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 227 పరుగులకే పరిమితమైంది. దాంతో 85 పరుగుల తేడాతో ఐర్లాండ్​ గెలుపొందింది. జోసెఫిన్ ఎన్కోమో (66; 106 బంతుల్లో 6x4) టాప్ స్కోరర్.

Story first published: Tuesday, October 12, 2021, 10:49 [IST]
Other articles published on Oct 12, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+