చెలరేగిన స్టిర్లింగ్.. ఇంగ్లండ్‌కు షాక్.. భారీ టార్గెట్ ఛేదించిన ఐర్లాండ్‌!!

సౌతాంప్టన్‌: వరుసగా రెండు వన్డేలు గెలిచి ఊపుమీదున్న ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. మూడో వన్డేలో ఇంగ్లండ్ విధించిన‌ భారీ టార్గెట్‌ను పసికూన ఐర్లాండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (128 బంతుల్లో 142; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ ఆండ్రూ బాల్బిర్నీ (112 బంతుల్లో 113; 12 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో 329 పరుగుల లక్ష్య చేధనను ఐర్లాండ్‌ 49.5 ఓవర్లలో ఛేదించింది. పాల్ స్టిర్లింగ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. మ్యాచ్ ఓడినా ఇంగ్లండ్ 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. మొదటి రెండు వన్డేలను ఇంగ్లండ్ గెలిచిన విషయం తెలిసిందే.

 అదిరే ఆరంభం:

అదిరే ఆరంభం:

329 పరుగుల లక్ష్య చేధనకు దిగిన ఐర్లాండ్‌కు మంచి శుభారంభం దక్కింది. పాల్ స్టిర్లింగ్‌కు మరో ఓపెనర్ గారెత్ డెలానీ (12) అండగా నిలిచాడు. ఇద్దరు కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం డేవిడ్ విల్లే బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. ఆపై ఆండ్రూ బాల్బిర్నీ అండతో స్టిర్లింగ్ చెలరేగిపోయాడు. స్టిర్లింగ్ భారీ షాట్లతో విరుచుకుపడగా.. బాల్బిర్నీ సమయోచితంగా ఆడాడు. ఈ జోడీని విడదీయడానికి ఇంగ్లీష్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

 చెలరేగిన స్టిర్లింగ్:

చెలరేగిన స్టిర్లింగ్:

పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్బిర్నీ‌ ఇంగ్లండ్‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ హాఫ్ సెంచరీ, సెంచరీలు సాదించారు. ముఖ్యంగా స్టిర్లింగ్ సిక్సులతో రెచ్చిపోయాడు. ఇద్దరు కలిసి 200లకు పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం స్టిర్లింగ్ పెవిలియన్ చేరాడు. ఆపై కొద్దిసేపటికే బాల్బిర్నీ‌ పెవిలియన్ చేరినా.. దాదాపు ఐర్లాండ్ గెలిచే స్థితిలోనే నిలిచింది. చివర్లో హ్యారీ టెక్టర్ (29), కెవిన్ ఓ బ్రైన్ (21) పరుగులు చేయడంతో ఐరిష్ జట్టు భారీ టార్గెట్‌ను ఛేదించింది. ఇంగీష్ బౌలర్లలో డేవిడ్ విల్లే, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీశాడు.

మోర్గాన్‌ మెరుపు శతకం:

మోర్గాన్‌ మెరుపు శతకం:

అంతకుముందు.. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు జాసన్‌ రాయ్‌ (1), జానీ బెయిర్‌స్టో (4)తో పాటు జేమ్స్ విన్స్‌ (16) విఫలమవడంతో ఇంగ్లిష్‌ జట్టు 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టామ్ బాన్‌టన్‌ (58; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌)తో కలిసి కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. గతంలో ఐర్లాండ్‌ తరఫున ఆడిన అనుభవం ఉన్న మోర్గాన్‌.. ఐరిష్‌ బౌలర్లను ఉతికారేశాడు.

విల్లే హాఫ్ సెంచరీ:

విల్లే హాఫ్ సెంచరీ:

సెంచరీ అనంతరం మోర్గాన్‌ ఔట్‌ కాగా.. 26 పరుగుల తేడాలో ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. చివర్లో పేసర్ డేవిడ్ విల్లే (42 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), టామ్‌ కరన్‌ (38 నాటౌట్‌) రాణించడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేయగలిగింది. చివరలో ఐరిష్‌ బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ మరో బంతి ఉండగానే ఆలౌట్ అయింది. ఐర్లాండ్‌ బౌలర్లలో యాంగ్‌కు 3, లిటిల్‌, కాంపెర్‌కు చెరో రెండు వికెట్లు దక్కాయి.

ధోనీ ఇంటి వద్దే తీవ్ర సాధన చేస్తున్నాడు.. ఎందుకంటే?: రైనా

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, August 5, 2020, 8:02 [IST]
Other articles published on Aug 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X