క్రికెట్ ప్రపంచంలో కరోనా కలవరం.. మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు పాజిటివ్

క్రికెట్ ప్రపంచాన్ని కరోనా మహామ్మారి కలవరపెడుతోంది. ఇప్పటికే రెండేళ్లుగా క్రికెట్ మ్యాచ్‌లను సజావుగా సాగనివ్వని కరోనా మరోసారి తన పంజా విసురుతోంది. నేడు ఉదయాన్నే ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ హెడ్‌కు పాజిటివ్‌గా నిర్దారణ కాగా తాజాగా మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఐర్లాండ్ ఆటగాళ్లు పాల్ స్టిర్లింగ్, షేన్ గెట్‌కేట్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఐర్లాండ్ జట్టు అక్కడ కరోనా విజృంభణ కారణంగా ఆ దేశ జట్టుతో జరగాల్సిన వన్డే సిరీస్ వాయిదా పడింది. దీంతో ఐర్లాండ్ జట్టు అక్కడి నుంచే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లడానికి సిద్ధమైంది.
అక్కడ జనవరి 8 నుంచి 23 వరకు మూడు వన్డే మ్యాచ్‌లు, ఒక టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో నేడు వెస్టిండీస్ బయలుదేరడానికి ముందు ఐర్లాంట్ టీం మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు అయినా పాల్ స్టిర్లింగ్, షేన్ గెట్‌కేట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వారిద్దరు 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. జనవరి 9న తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. కాగా పాల్ స్టిర్లింగ్, షేన్ గెట్‌కేట్‌కు కరోనా సోకిన విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

పాల్ స్టిర్లింగ్, షేన్ గెట్‌కేట్ రికార్డులు
ఐర్లాండ్ తరఫున 134 వన్డే మ్యాచ్‌లు ఆడిన పాల్ స్టిర్లింగ్ 38 సగటులో 4982 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 177. 94 టీ20 మ్యాచ్‌ల్లో 30 సగటుతో 2606
పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 115. ఇక వన్డేల్లో 43, టీ20ల్లో 20 వికెట్లు తీశాడు. షేన్ గెట్‌కేట్ విషయానికొస్తే 25 టీ20 మ్యాచ్‌ల్లో 10 సగటుతో 204 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 24. 4 వన్డే మ్యాచ్‌ల్లో 7, 25 టీ20 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీశాడు.

యాషెస్ సిరీస్‌లో కరోనా విజృంభణ
ఆస్ట్రేలియా వేదికగా ఇంగ్లండ్, ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో కరోనా విజృంభిస్తోంది. ఇంగ్లండ్ జట్టు సహాయక బృందం సభ్యులతోపాటు వారి కుటుంబసభ్యులకు కలిపి ఇప్పటివరకు ఏడుగురికి కరోనా సోకింది. ఇవి కాకుండా ఒక జర్నలిస్టుకు కూడా సోకింది. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ హెడ్‌కు కూడా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇంతకుముందే ఆస్ట్రేలియా కెప్టెన్ పాటి కమిన్స్ కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన కారణంగా క్వారంటైన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. యాషెస్ సిరీస్‌లో ఇన్ని కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో తర్వాతి మ్యాచ్‌లు జరగడంపై అనుమానాలు నెలకొంటున్నాయి.

పాక్ కొంపముంచిన కరోనా
పలు కారణాలతో ఇతర జట్లు ఏవి కూడా పాకిస్థాన్‌లో పర్యటించని సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొన్ని రోజుల క్రితం వెస్టిండీస్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వెళ్లింది. అక్కడ టీ20 సిరీస్ మధ్యలోనే వెస్టిండీస్ శిబిరంలో కరోనా కలవరం మొదలైంది. విండీస్ టీం సభ్యులలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ఏదో ఒక విధంగా టీ20 సిరీస్‌ను పూర్తి చేసి వన్డే సిరీస్‌ను వాయిదా వేశారు.

భారత్, ఇంగ్లడ్ టెస్ట్ మ్యాచ్ వాయిదా
కొన్ని నెలల క్రితం కరోనా కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ కూడా రద్దయింది. దీంతో ఆ మ్యాచ్‌ను 2022కు వాయిదా వేశారు. ఇలా క్రికెట్ ప్రపంచాన్ని కరోనా మళ్లీ కలవరపెడుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వదిలి పెట్టడం లేదు. దీంతో గతంలో మాదిరిగా మ్యాచ్‌లన్ని మళ్లీ వాయిదా పడి, కొన్ని రోజులు క్రికెట్ ఆగిపోయే ప్రమాదం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications