ఐర్లాండ్ సంచలనం.. వెస్టిండీస్‌ను సొంత గడ్డపైనే ఓడించి సిరీస్ కైవసం

జమైకా: వెస్టిండీస్ పర్యటనలో పసికూన ఐర్లాండ్ సంచలనం సృష్టించింది. కరేబియన్లను సొంత గడ్డపైనే ఓడించి వన్డే సిరీస్‌ను ఎగేరేసుకుపోయింది. తొలి వన్డేలో ఓడినప్పటికీ, రెండు, మూడు వన్డేల్లో గెలిచిన ఐర్లాండ్ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆండీ మెక్‌బ్రైన్, హ్యారీ టెక్టర్ హాఫ్ సెంచరీలతో రాణించి మూడో వన్డే మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఆండీ మెక్‌బ్రైన్ అయితే బౌలింగ్‌లోనూ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచాడు.

212 పరుగులకే విండీస్ ఆలౌట్
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 212 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు ఓపెనర్ షాయ్ హోప్(53) హాఫ్ సెంచరీతో రాణించగా, హోల్డర్ 44 పరుగులతో పర్వాలేదనిపించాడు. అకేల్ హోసేన్ 23, స్మిత్ 20, రోస్టన్ చేజ్ 19, రొమారియో షెపర్డ్ 13, జస్టిన్ గ్రీవ్స్ 12, జోసెఫ్ 6, పోలార్డ్ 3, పూరన్ 2 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో ఆండీ మెక్‌బ్రైన్ 4 వికెట్లతో చెలరేగగా, క్రెయిగ్ యంగ్ 3, కర్టిస్ కాంఫర్, డాక్రెల్ తలో వికెట్ తీశారు.

మెక్‌బ్రైన్ , హ్యారీ టెక్టర్ హాఫ్ సెంచరీలు
అనంతరం 214 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 44.5 ఓవర్లలో 8 వికెట్లు లక్ష్యాన్ని చేధించింది. దీంతో ఆ జట్టు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఆండీ మెక్‌బ్రైన్ (59), హ్యారీ టెక్టర్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ కూడా 44 పరుగులతో పర్వాలేదనిపించాడు.
కర్టిస్ కాంఫర్ 11, గారెత్ డెలానీ 10, జార్జ్ డాక్రెల్ 7, యంగ్ 5, నీల్ రాక్ 2, మార్క్ 1 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్, అకేల్ హోసేన్ మూడేసి వికెట్లతో సత్తా చాటారు. జోసెఫ్, స్మిత్ తలో వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులకు ఐర్లాండ్ ఆల్ రౌండర్ ఆండీ మెక్‌బ్రైన్ ఎంపికయ్యాడు.

వన్డే సిరీస్ ఐర్లాండ్ కైవసం
ఈ విజయంతో కరేబియన్ గడ్డపై ఐర్లాండ్ జట్టు తొలి సారి వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. సిరీస్ ప్రారంభమవడానికి ముందు, సిరీస్ సాగుతుండగా ఐర్లాండ్ జట్టులో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఐర్లాండ్ జట్టు వన్డే సిరీస్ గెలిచి సత్తా చాటింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications