
బ్రాండన్ కింగ్
వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ 48 బంతుల్లో ఒక సిక్స్, 6 ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జన్సన్ చార్లెస్ 18 బంతుల్లో సిక్స్, 3 ఫోర్లతో 24 పరుగులు చేయగా ఒడియన్ స్మీత్ 19 పరుగలు చేశాడు. మిగతా వారు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలానీ 4 ఓవర్లలో 16 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.సిమి సింగ్, బారీ మెక్‌కార్తీ ఒక్కో వికెట్ తీశారు.

పాల్ స్టిర్లింగ్
147 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఐర్లాండ్ ఓపెనర్లు అలవోకగా కరేబియన్ బౌలర్లను ఎదుర్కొంటు బౌండరీలు తరలించారు. ఐర్లాండ్ 17 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. పాల్ స్టిర్లింగ్ 48 బంతుల్లో 2 సిక్స్ లు, 6 ఫోర్లతో 66 పరుగులతో అజేయంగా నిలువగా.. వికెట్ కీపర్ లోర్కాన్ టక్కర్ 35 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్లతో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ ఆండ్రూ బల్బిర్నీ 23 బంతుల్లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. అకెల్ హుస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు.

స్కాట్లాండ్, జింబాబ్వే
గ్రూప్ ఎ నుంచి ఇప్పటికే శ్రీలంక, నెదర్లాండ్స్ సూపర్-12కు వెళ్లగా గ్రూప్ నుంచి వెస్టిండీస్ పై గెలిచిన ఐర్లాండ్ సూపర్-12 వెళ్లింది. స్కాట్లాండ్, జింబాబ్వేలో ఏ జట్టు గెలుస్తే ఆ జట్టుసూపర్-12కు వెళ్తుంది. కాగా శనివారం నుంచి సూరప్-12 మ్యాచ్ లు ప్రారంభ కానున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ తో తలపడనుంది. ఆదివారం భారత్ పాకిస్థాన్ తో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications
