Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: స్కాట్లాండ్‍పై ఐర్లాండ్ విజయం.. వెస్టిండీస్ పని అయిపోయినట్లేనా..!

Ireland beat Scotland by 6 wickets in t20 world cup 2022

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్ లో స్కాట్లాండ్ పై ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ఆటగాడు మైఖేల్ జోన్స్ 55 బంతుల్లో 4 సిక్స్ లు, 6 ఫోర్లతో 86 పరుగులు చేశాడు. కెప్టెన్ బెరింగ్టన్ 37 పరుగులు చేయడంతో స్కాట్లాండ్ భారీ స్కోర్ చేసింది.

కర్టిస్ కాంఫర్
ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ కాంఫర్ 2 వికెట్లు తీయగా.. జాషువా లిటిల్, మార్క్ అడైర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కర్టిస్ కాంఫర్ 32 బంతుల్లో 2 సిక్స్ లు, 7 ఫోర్లతో 72 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతనికి జార్జ్ డాక్రెల్ 27 బంతుల్లో 39 పరుగులతో సహకరించాడు. దీంతో ఐర్లాండ్ విజయం సాధించింది.

వెస్టిండీస్
స్కాట్లాండ్ బౌలర్లలో మార్క వాట్, వేల్, షరిఫ్, లీస్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు. గ్రూప్ బిలో జింబాబ్వే, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఒక్కో విజయం సాధించాయి. ఈ మూడు జట్లకు రెండేసి పాయింట్లు ఉండగా.. వెస్టిండీస్ ఈ గ్రూప్ లో చివరి స్థానంలో ఉంది. జింబాబ్వేతో జరిగే మ్యాచ్ లో గెలిస్తేనే వెస్టిండీస్ కు సూపర్ 12కు అవకాశం ఉంటుంది.

Story first published: Wednesday, October 19, 2022, 14:04 [IST]
Other articles published on Oct 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+