
ఐర్లాండ్: ఐదు టీ20 సిరీసులో భాగంగా బుధవారం బ్రెడీ క్రికెట్ క్లబ్ వేదికగా జరిగిన మూడో టీ20లో జింబాబ్వేపై ఐర్లాండ్ ఘన విజయం సాధించింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ సూపర్ సెంచరీ (115 నాటౌట్; 75 బంతుల్లో 8x8, 8x8) బాదడంతో ఐర్లాండ్ 40 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో స్టిర్లింగ్ సిక్సుల వర్షం కురిపించాడు. ఏకంగా 8 సిక్సులు బాదాడు. 8 బౌండరీలు కూడా బాది సూపర్ సెంచరీ సాదించాడు. స్టిర్లింగ్‌కు తోడు ఆండ్రూ బాల్బిర్నీ (31; 24 బంతుల్లో 3x8, 1x8), మార్క్ అడైర్ (మూడు వికెట్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో ఐర్లాండ్ టీ20 సిరీసులో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే వేదికపై ఈరోజు నాలుగో మ్యాచ్ జరగనుంది.
బుధవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో టాస్ ఓడిపోయిన ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. స్టార్ ఓపెనర్ కెవిన్ ఓ బ్రెయిన్ (9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరినా.. వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ ఆండ్రూ బల్బెరియన్ (31)తో కలిసి పాల్ స్టిర్లింగ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. స్టిర్లింగ్ మొదటి బంతి నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికిఆరేశాడు. ఈ తరుణంలోనే ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అదే సమయంలో స్టిర్లింగ్ తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 47 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో స్టిర్లింగ్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
హాఫ్ సెంచరీ అనంతరం పాల్ స్టిర్లింగ్ మరింత వేగం పెంచాడు. సిక్సుల వర్షం కురిపించాడు. దీంతో గెట్‌కేట్ క్రీజులో ఉన్నా.. ప్రేక్షక పాత్ర పోషించాడు. 11 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 19 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. తాను ఎదుర్కున్న 28 బంతుల్లోనే స్టిర్లింగ్ 65 పరుగులు చేశాడు. దాంతో టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా స్టిర్లింగ్ 75 బంతులు ఎదుర్కుని 115 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. నిర్ణీత 20 ఓవర్లకు ఐర్లాండ్ జట్టు రెండు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. స్టిర్లింగ్ దాటికి టెండై చతారా తన నాలుగు ఓవర్ల కోటాలో 47 రన్స్ ఇచ్చాడు. ల్యూక్ జోంగ్వే (37), ర్యాన్ బర్ల్ (30) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన జింబాబ్వే పూర్తిగా తేలిపోయింది. ఐర్లాండ్ బౌలర్ల దెబ్బకు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో ఏ దశలోనూ లక్ష్యం ఛేదించే దిశగా వెళ్లలేదు. 84 పరుగులకే సగం టీం పెవిలియన్ చేరింది. ఆ జట్టుకు కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్లీ మాధెవరె (13), తడివనాషే జర్మనీ (14), రెజిస్ చక్కబవ (7), మిల్టన్ శుంబా (6), ల్యూక్ జోంగ్వే (7) పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ మూడు వికెట్లు తీయగా.. జోష్ లిటిల్, షేన్ గెట్కెట్, బెన్ వైట్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.