భారత్‌లో పుట్టి ఐర్లాండ్ జట్టు తరుపున: ఎవరీ సిమి సింగ్?

హైదరాబాద్: భారత్‌లో పుట్టి పంజాబ్ తరుపున అండర్-14, 17 జట్లకు ప్రాతినిథ్యం వహించిన సిమ్రన్‌జీత్ సింగ్ అనే క్రికెటర్ ప్రస్తుతం ఐర్లాండ్ తరుపున ఆడుతున్నాడు. అంతేకాదు త్వరలో టీమిండియాతో జరగబోయే రెండు టీ20ల సిరిస్‌లో కూడా చోటు దక్కించుకున్నాడు.
టీమిండియాతో తలపడే ఐర్లాండ్ జట్టును ఇటీవల ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ జట్టులో భారత సంతతికి చెందిన సిమ్రన్‌జీత్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. మొహాలీలో పుట్టిన 31 ఏళ్ల సిమ్రన్‌జీత్ సింగ్ గతేడాది ఐర్లాండ్ తరుపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

పంజాబ్ తరుపున అండర్-14, 17 జట్లకు ప్రాతినిథ్యం
పంజాబ్ తరుపున అండర్-19కు ఆడే సమయంలో జట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత అవకాశాలు కూడా పూర్తిగా తగ్గాయి. అదే సమయంలో ఐర్లాండ్‌లో ఉన్న సిమ్రన్‌జీత్ సింగ్ స్నేహితుడు గౌరవ్ ఐర్లాండ్‌కు వచ్చి క్రికెట్ ఆడమని సూచించాడు. దీంతో ఐర్లాండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఐర్లాండ్ తరఫున సెకండ్ డివిజన్ క్రికెట్‌లో
అక్కడికి వెళ్లిన అనంతరం ఐర్లాండ్ తరఫున సెకండ్ డివిజన్ క్రికెట్‌లో ఆడాడు. నిజానికి పంజాబ్ తరఫున ఆడే సమయంలో అతడు బ్యాట్స్‌మెన్‌గా ఉండేవాడు. కానీ, ఐర్లాండ్ వెళ్లిన తర్వాత అతడు స్పిన్ బౌలింగ్‌లో శిక్షణ పొందాడు. దీంతో ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.

సిమ్రన్‌జీత్ సింగ్ కాస్త సిమి సింగ్ అయ్యాడు
అంతేకాదు సిమ్రన్‌జీత్ సింగ్ కాస్త సిమి సింగ్ అయ్యాడు. అతి తక్కువ కాలంలోనే ఐర్లాండ్ జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. గతేడాది ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన సిమి సింగ్ ఈ ఏడాది జూన్‌లో ఐర్లాండ్ తరఫున టీ20 అరంగేట్రం చేశాడు.

7 వన్డేలు ఆడిన సిమి సింగ్ 82 పరుగులు, 8 వికెట్లు
ఐర్లాండ్ తరుపున ఇప్పటివరకూ 7 వన్డేలు ఆడిన సిమి సింగ్ 82 పరుగులు, 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 4 టీ20ల్లో 96 పరుగులు, 6 వికెట్లు సాధించాడు. జులై 27, 28 తేదీల్లో కోహ్లీసేనతో జరగనున్న రెండు టీ20ల సిరిస్ నేపథ్యంలో సిమి సింగ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications