Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇరానీ కప్: హనుమ విహారి సెంచరీ, రెస్టాఫ్‌ ఇండియా 330 ఆలౌట్‌

Irani Cup: Vihari strikes hundred but Vidarbha bowl out Rest of India

హైదరాబాద్: రంజీ ట్రోఫీ చాంపియన్‌ విదర్భపై ఇరానీ ట్రోఫీలో మొదటి రోజు రెస్టాఫ్‌ ఇండియా భారీ స్కోరు నమోదు చేసింది. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్‌లో విదర్భ బౌలర్లు రాణించడంతో రెస్టాఫ్‌ ఇండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. రెస్టాఫ్ ఇండియా జట్టులో ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి (211 బంతుల్లో 114; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, మయాంక్‌ అగర్వాల్‌ (134 బంతుల్లో 95; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీని చేజార్చుకున్నాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రెస్టాఫ్‌ ఇండియా

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రెస్టాఫ్‌ ఇండియా

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రెస్టాఫ్‌ ఇండియా ఆరంభంలోనే అన్‌మోల్‌ ప్రీత్‌ (15) వికెట్‌ కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విహారితో కలిసి మయాంక్ ధాటిగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మ్యాచ్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడటం మొదలుపెట్టిన మయాంక్‌ ఆ తర్వాత కూడా జోరు ప్రదర్శిస్తూ 75 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

రెండో సెషన్‌లో చెలరేగిన విహారి

రెండో సెషన్‌లో చెలరేగిన విహారి

ఆ తర్వాత రెండో సెషన్‌లో విహారి చెలరేగిపోవడంతో పాటు విదర్భ బౌలర్ సర్వతే ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన అతను 75 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దిశగా దూసుకుపోతున్న మయాంక్‌... మరో భారీ షాట్‌కు ప్రయత్నించి మిడాఫ్‌లో గుర్బానీకి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత రెస్టాఫ్‌ బ్యాటింగ్‌ తడబడింది. ఒకరి వెంట మరొకరు వేగంగా పెవిలియన్‌ చేరారు.

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో విహారికి ఇది 16వ సెంచరీ

ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో విహారికి ఇది 16వ సెంచరీ

టాపార్డర్‌లో కెప్టెన్‌ అజింక్యా రహానె (13), శ్రేయస్‌ అయ్యర్‌ (19) విఫలమయ్యారు. ఇషాన్‌ కిషన్‌ (2), కృష్ణప్ప గౌతమ్‌ (7), ధర్మేంద్రసిన్హ్‌ జడేజా (6) కూడా నిరాశపర్చారు. దీంతో రెస్టాఫ్‌ 72 పరుగుల తేడాతో ఐదు వికెట్లను కోల్పోయింది. ఒక్కో బ్యాట్స్‌మన్‌ పెవిలియన్‌కు క్యూకడుతున్నా.. విహారి ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో విహారికి ఇది 16వ సెంచరీ.

రెండో రోజు బ్యాటింగ్‌కు దిగనున్న విదర్భ

రెండో రోజు బ్యాటింగ్‌కు దిగనున్న విదర్భ

అంకిత్‌ రాజ్‌పుత్‌ (25) సహకారంతో హనుమ విహారి జట్టు స్కోరును 300 దాటించాడు. చివర్లో రాహుల్‌ చహర్‌ (22) విహారికి అండగా నిలిచాడు. విదర్భ బౌలర్లలో ఆదిత్య సర్వాటే, అక్షయ్‌ వఖారే మూడేసి వికెట్లు పడగొట్టగా.. రజ్‌నేష్‌ రెండు, యశ్‌ ఠాకూర్‌, అక్షయ్‌ కర్నేవర్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగనున్న విదర్భ భారీ స్కోరు చేసి తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించాలనే పట్టుదలతో ఉంది.

Story first published: Wednesday, February 13, 2019, 10:49 [IST]
Other articles published on Feb 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+