Irani Cup 2024: సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ.. రహానెకు హార్ట్ బ్రేక్ (Video)
టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ క్రమంగా పరుగుల యంత్రంగా మారుతున్నాడు. ఇరానీ కప్ 2024లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ శతకంతో చెలరేగాడు. 149 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 14 బౌండరీలతో హోరెత్తించాడు. సర్ఫరాజ్ సత్తాచాటడంతో బుధవారం లంచ్ విరామానికి ముంబై 94 ఓవర్లలో 338/6 స్కోరు చేసింది.
అయితే ఓవర్‌నైట్ స్కోరుతో 237/4 ఇవాళ రెండో రోజు ఆట ఆరంభించిన ముంబై ఆదిలోనే వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న కెప్టెన్ అజింక్య రహానె 97 పరుగుల వద్ద ఔటయ్యాడు. యశ్ దయాల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రహానె-సర్ఫరాజ్ 131 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే షామ్స్ ములాని (5) కూడా ఔటవ్వడంతో ముంబై స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

అయితే ప్రత్యర్థి జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించకుండా సర్ఫరాజ్.. తనుష్ కొటియన్ (26 నాటౌట్)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. తనుష్‌తో కలిసి అభేద్యమైన అర్ధశతక భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో శతకం సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్‌కు ఇది 15వ సెంచరీ. 74 ఇన్నింగ్స్‌ల్లో వీటితో పాటు 14 హాఫ్ సెంచరీలు కూడా బాదాడు.
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే రెండు టెస్టుల్లోనూ తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వడంతో అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు. మరోవైపు ఇటీవల తన సోదరుడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రాణాపాయం తప్పినప్పటికీ మెడ భాగంలో గాయాలయ్యాయి. అయినా సర్ఫరాజ్ మైదానంలో ఏకాగ్రత కోల్పోకుండా పరుగులతో సత్తాచాటుతుండటం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications