Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs RR: రోహిత్, కిషన్‌ ఔట్.. సూర్యకుమార్‌ హాఫ్ సెంచరీ!!

Suryakumar Yadav fifty drives MI after Krunal Pandya wicket

అబుదాబి: రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుకు భారీ షాక్ తగిలింది. జోరుగా సాగుతున్న ముంబై ఇన్నింగ్స్‌కు స్పిన్నర్‌ శ్రేయాస్‌ గోపాల్‌ ఒక్కసారి ‌బ్రేక్‌ వేశాడు. పదో ఓవర్లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టి ముంబైని భారీ దెబ్బకొట్టాడు. మొదటి బంతికి క్రీజులో కుదురుకున్న రోహిత్‌ శర్మ (35)ను పెవిలియన్ చేర్చగా.. రెండో బంతికి అప్పుడే బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్‌ కిషన్ ‌(0)ను ఔట్‌ చేసి చేశాడు. దీంతో రాజస్థాన్‌ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే సూర్యకుమార్‌ యాదవ్‌ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్లు క్వింటన్‌ డికాక్ ‌(23: 15 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌), రోహిత్‌ శర్మ (35: 23 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సులు),శుభారంభం అందించారు. వీరిద్దరూ మొదటి ఓవర్‌ నుంచే రన్‌రేట్‌ 10కి తగ్గకుండా పరుగులు రాబట్టారు. ఐపీఎల్‌లోనే తొలి మ్యాచ్‌ ఆడుతున్న యువ బౌలర్‌ కార్తీక్‌ త్యాగీ తన మొదటి ఓవర్‌లోనే వికెట్‌ తీసి అదరగొట్టాడు. ఐదో ఓవర్‌ ఐదో బంతికి డికాక్‌ను పెవిలియన్‌ పంపాడు.

అనంతరం త్యాగీ వేసిన ఏడో ఓవర్లో కూడా ముంబై బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయారు. కార్తీక బౌలింగ్ అందరిని ఆకట్టుకుంటోంది. రనప్ ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీలా.. బంతిని డెలివరీ చేసే విధానం ఇషాంత్ శర్మలా ఉంది. ఇక గత మ్యాచులో సిక్సులు బాదిన కృనాల్ పాండ్యా.. పూర్తిగా తేలిపోయాడు. 17 బంతుల్లో 12 పరుగులే చేసి జోఫ్రా ఆర్చర్‌కు చిక్కాడు. అయితే సూర్యకుమార్‌ యాదవ్‌ దూకుడుగా ఆడుతున్నాడు. హాఫ్ సెంచరీ చేశాడు. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ప్రస్తుతం సూర్యకుమార్‌ యాదవ్ ‌(52), హార్దిక్ పాండ్యా (3) క్రీజులో ఉన్నారు.

MI vs RR: రాజస్థాన్‌తో మ్యాచ్‌ అయ్యాక.. అంతా అతని గురించే చర్చించుకుంటారు: ఆకాశ్‌
https://telugu.mykhel.com/cricket/ipl-2020-mi-vs-rr-aakash-chopra-says-people-will-start-talking-about-hardik-pandya-after-rr-match-030728.html

Story first published: Tuesday, October 6, 2020, 21:28 [IST]
Other articles published on Oct 6, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+