IPL Winners List: ఈ సారి ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్ రానుంది. ఎందుకంటే 2008 నుంచి ఆడుతున్న పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంకా ఏ ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకోలేదు. జూన్ 3, మంగళవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో ఈ రెండు జట్లు ఐపీఎల్ ఫైనల్‌లో తలపడనున్నాయి. 2008 నుంచి ఇప్పటివరకు ప్రతి సీజన్‌లో ఏ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఎవరు రన్నరప్‌గా నిలిచారు అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఐపీఎల్‌లో అత్యధిక ట్రోఫీలను గెలుచుకున్న జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. రెండు తలో 5 ట్రోఫీలను గెలుచుకున్నాయి. కానీ ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరుకోలేదు. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా అవతరించింది. ముంబై ఇండియన్స్ నాల్గవ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. అయితే ముంబై జట్టు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయారు.

ఐపీఎల్ విజేతల జాబితా(2008 నుంచి 2024 వరకు)
ఐపీఎల్ 2008 విజేత: రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ 2009 విజేత: డెక్కన్ ఛార్జర్స్
ఐపీఎల్ 2010 విజేత: చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2011 విజేత: చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2012 విజేత: కోల్‌కతా నైట్ రైడర్స్
ఐపీఎల్ 2013 విజేత: ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2014 విజేత: కోల్‌కతా నైట్ రైడర్స్
ఐపీఎల్ 2015 విజేత: ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2016 విజేత: సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ 2017 విజేత: ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2018 విజేత: చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2019 విజేత: ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2020 విజేత: ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2021 విజేత: చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2022 విజేత: గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2023 విజేత: చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2024 విజేత: కోల్‌కతా నైట్ రైడర్స్
ఐపీఎల్‌లో రన్నరప్ జట్లు ఇవే..
2008: చెన్నై సూపర్ కింగ్స్
2009: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2010: ముంబై ఇండియన్స్
2011: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2012: చెన్నై సూపర్ కింగ్స్
2013: చెన్నై సూపర్ కింగ్స్
2014: పంజాబ్ కింగ్స్
2015: చెన్నై సూపర్ కింగ్స్
2016: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
2017: రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్
2018: సన్‌రైజర్స్ హైదరాబాద్
2019: చెన్నై సూపర్ కింగ్స్
2020: ఢిల్లీ క్యాపిటల్స్
2021: కోల్‌కతా నైట్ రైడర్స్
2022: రాజస్థాన్ రాయల్స్
2023: గుజరాత్ టైటాన్స్
2024: సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డులను గెలుచుకున్న రికార్డును సునీల్ నరైన్ కలిగి ఉన్నాడు. సునీల్ నరైన్ ఈ అవార్డును మొత్తం 3 సార్లు(2012, 2018, 2014) గెలుచుకున్నాడు.
అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన జట్టు
చెన్నై సూపర్ కింగ్స్ అత్యధిక ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన జట్టుగా నిలిచింది. సీఎస్కే జట్టు మొత్తం 10 సార్లు ఫైనల్స్ ఆడింది. వాటిలో సీఎస్కే జట్టు 5 సార్లు గెలిచి అదే సంఖ్యలో ఓడిపోయారు. ముంబై ఇండియన్స్ 6 సార్లు ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరుకుంది. వాటిలో వారు ఒక సారి మాత్రమే ఓడిపోయారు.
ఆర్సీబీ ఎన్ని సార్లు ఫైనల్‌కు చేరుకుంది?
ఐపీఎల్ 2025కి ముందు ఆర్సీబీ మొత్తం 3 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఎప్పుడూ ట్రోఫీని గెలవలేదు. ఆర్సీబీ 2009, 2011, 2016లో ఫైనల్స్‌కు చేరుకుంది.
పంజాబ్ కింగ్స్ ఎన్ని సార్లు ఫైనల్‌కు చేరుకుంది?
ఐపీఎల్ 2025కి ముందు పంజాబ్ కింగ్స్ ఒకేసారి ఐపీఎల్ ఫైనల్ కు చేరుకుంది. 2014లో వారు కేకేఆర్ చేతిలో ఫైనల్‌లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఈ జట్టు పైనల్ ఆడటం ఇదే మొదటిసారి.