ఐపీఎల్ భవిష్యత్ ఏమిటో తేల్చేసిన కొత్త ఛైర్మన్..!!

ముంబై: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ సెమీ ఫైనల్స్‌కు ముహూర్తం సమీపిస్తోంది. ఇంకొన్ని గంటల్లో తొలి సెమీ ఫైనల్ ఆరంభం కాబోతోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇందులో న్యూజిలాండ్-పాకిస్తాన్ తలపడబోతోన్నాయి. ఈ మెగా ఈవెంట్ సెమీ ఫైనల్స్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన బ్లాక్ క్యాప్స్‌తో ఢీ కొట్టబోతోంది పాకిస్తాన్.

రెండు రోజుల్లోనే..
టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ ముగిసిన రెండో రోజు నుంచే ఇక ఐపీఎల్ సందడి ఆరంభం కాబోతోంది. మినీ వేలం పాట కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సమాయాత్తమౌతోంది. డిసెంబర్ 15వ తేదీన దీన్ని నిర్వహించే అవకాశం ఉంది. తమ ఫ్రాంఛైజీల్లో కొనసాగబోయే లేదా విడుదల అయ్యే ప్లేయర్ల వివరాలను ఈ నెల 15వ తేదీ నాటికి అందజేయాల్సి ఉంటుందంటూ ఇప్పటికే డెడ్‌లైన్ విధించింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలన్నీ దీనిపై కసరత్తు చేస్తోన్నాయి.

కొత్త ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..
ఈ పరిస్థితుల మధ్య ఐపీఎల్ కొత్త ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్లపై కోట్ల రూపాయల వర్షాన్ని కురిపించే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్‌గా ఐపీఎల్ త్వరలోనే ఆవిర్భవించబోతోందని, ఈ దిశగా తాము పని చేస్తోన్నామని అన్నారు. వచ్చే అయిదేళ్లల్లో ఈ హోదాను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

94 వరకు మ్యాచ్‌లు..
భవిష్యత్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని అరుణ్ ధుమాల్ అన్నారు. వచ్చే అయిదేళ్ల సైకిల్ నాటికి ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్యను 94కు తీసుకెళ్లాలన్నదే తమ టార్గెట్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 74 మ్యాచ్‌ల వరకు ఇది పరిమితమైందని, క్రమంగా 84 అనంతరం 94 వరకు చేరుస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం నేషనల్ ఫుట్‌బాల్ లీగ్- ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంట్‌గా ఉంటోందని, దీన్ని త్వరలోనే అధిగమిస్తామని చెప్పారు.

ఫ్రాంఛైజీల సంఖ్య పెరగకపోవచ్చు..
ఐపీఎల్‌లో ఆడే ఫ్రాంఛైజీల సంఖ్య 10కి మించకపోవచ్చని అరుణ్ ధుమాల్ చెప్పారు. ఈ సంఖ్యను పెంచుకుంటే టోర్నమెంట్‌ను నిర్వహించడం కష్టమౌతుందని వ్యాఖ్యానించారు. మొదటి రెండు సీజన్‌ల కోసం 74 గేమ్‌లను షెడ్యూల్ చేశామని, క్రమంగా ఇది 84, అనంతరం 94 వరకు వెళ్తుందనీ చెప్పుకొచ్చారు.

నో పర్మిషన్..
బీసీసీఐతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఆటగాళ్లు ఇతర లీగ్‌లల్లో ఆడకూడదని బీసీసీఐ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని అరుణ్ ధుమాల్ వివరించారు. కాంట్రాక్టు లేని వారు కూడా భారత్ కోసం ఆడాలని భావిస్తోన్నారని, వారి ఫిట్‌నెస్, ఇతర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఇతర లీట్ టోర్నీల్లో ఆడటానికి భారత క్రికెటర్లకు అనుమతి ఇవ్వట్లేదని చెప్పారు. భారత్‌లో పలు క్రికెటింగ్ ఈవెంట్స్, స్పోర్ట్స్ జరుగుతున్నాయని గుర్తు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications