Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్: ఢిల్లీపై విరాట్ కోహ్లీ గణాంకాలు ఇవే

IPL 2019 : Royal Challengers Vs Delhi Capitals | Virat Kohli Stats On Delhi Capitals | Oneindia
IPL: Virat Kohli hits 761 runs agenest Delhi Capitals

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలాంటి బౌలర్ బౌలింగ్ వేసినా పరుగులు చేస్తూనే ఉంటాడు. అది టెస్ట్, వన్డే, టీ 20 ఇలా ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారాల్సిందే. వీటితో పాటు కోహ్లీ ఐపీఎల్‌లో కూడా చెలరేగిపోతున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌పై కూడా విరాట్ రికార్డు మెరుగ్గానే ఉంది.

761 పరుగులు:

761 పరుగులు:

విరాట్ కోహ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు ఆడాడు. 18 మ్యాచ్‌లలో బరిలోకి దిగగా.. 69.19 సగటుతో 761 పరుగులు చేసాడు. స్ట్రయిక్ రేట్ 139.89గా ఉంది. ఢిల్లీపై 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 99. ఈ గణాంకాలు చూస్తే ఢిల్లీపై కోహ్లీ రికార్డు బాగానే ఉంది.

టీ20ల్లో 8 వేల పరుగులు:

టీ20ల్లో 8 వేల పరుగులు:

శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఓ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 243 ఇన్సింగ్స్‌లో కోహ్లీ టీ20ల్లో 8వేల పరుగులను పూర్తి చేసాడు. సురేశ్ రైనా 284 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు.

తడబడుతున్న బెంగళూరు:

తడబడుతున్న బెంగళూరు:

ఐపీఎల్‌-12లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. మొదటగా బ్యాటింగ్ చేస్తున్న బెంగళూరు జట్టు ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ కోహ్లీ జట్టును ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. బెంగళూరు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ (20), స్టయినిస్ (14)లు ఉన్నారు.

Story first published: Sunday, April 7, 2019, 17:11 [IST]
Other articles published on Apr 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+