ఐపీఎల్ మెగా వేలం-2025కు సంబంధించిన నిబంధనలు, రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఇటీవల ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆర్‌టీఎమ్‌ను ఉపయోగించుకుంటూ ఆరుగురు ప్లేయర్ల వరకు రిటైన్ చేసుకునే వెసులు బాటు ఫ్రాంచైజీలకు కల్పించింది. అయితే ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది.
అలాగే రిటెన్షన్ పాలసీ ధరను కూడా నిర్ణయించింది. అయిదుగురును రిటైన్ చేసుకుంటే ఫ్రాంచైజీ రూ.45 కోట్లను తన పర్స్ వ్యాల్యూ నుంచి కోల్పోవాల్సి ఉంటుంది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ రిటెన్షన్ ధర రూ. 4 కోట్లుగా నిర్ణయించింది. అయితే రిటైర్మెంట్ తీసుకుని అయిదేళ్గు గడిచిన ఆటగాళ్లను అన్‌క్యాప్డ్ ప్లేయర్ పరిగణిస్తూ గత నిబంధనను తిరిగి బీసీసీఐ అమలు చేసింది.

''ఓ భారత ప్లేయర్ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఇలా పరిగణిస్తారు. గత అయిదేళ్ల క్యాలెండ్ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లో అయినా తుదిజట్టులో కూడా చోటు దక్కించుకోని ఆటగాళ్లు, అలాగే ఆ సదరు ప్లేయర్లు బీసీసీఐతో సెంట్రల్ కాంట్రక్ట్ కూడా లేకుండా ఉంటే అన్‌క్యాప్డ్‌గా పరిగణిస్తారు. ఇది భారత ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుంది'' అని బీసీసీఐ నిబంధన వెల్లడించింది.
అయితే ఈ నిబంధనను చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ గురించే బీసీసీఐ తిరిగి తీసుకువచ్చిందని భారత మాజీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. ఐపీఎల్‌లో ధోనీ ప్రధాన పాత్ర పోషించాడని, ఈ రూల్‌ను తిరిగి తీసుకురావాలని తాను కూడా కోరుకున్నట్లు తెలిపాడు. ఈ రూల్ ఆర్థికంగానూ మేలు చేస్తుందని డీకే పేర్కొన్నాడు. ధోనీ మైదానంలోకి అడుగుపెడితే రేటింగ్స్ భారీగా పెరుగుతాయని, ఏ బ్రాడ్‌కాస్టర్ అయినా ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తుందని అన్నాడు. ఇది ఐపీఎల్‌కు ఉపయోగపడే నిర్ణయమని అన్నాడు.