
హైదరాబాద్: జనవరి 27, 28 తేదీల్లో 580 మంది ఆటగాళ్లకు వేలం జరిగింది. ఇందులో 169 ఆటగాళ్లను కొనుగోలు చేయగా 56 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే అటు అభిమానుల్లో ఇటు క్రీడాకారుల్లో మొదలైన సందేహం ఐపీఎల్ వేలం అనంతరం జట్టు నచ్చకపోతే, ఆ జట్టులో ఇమడలేమనిపిస్తే ఏం చేయాలనేవి మొదలైయ్యాయి.
ఇప్పుడు దానికి సమాదానంగా ఫుట్‌బాల్ పద్ధతిని ఐపీఎల్ లోనూ ప్రవేశపెట్టనున్నారు. జట్టు కొనుగోళ్లు పూర్తయ్యాక ఆటగాళ్లకు నచ్చకపోతే వాళ్లకు నచ్చిన జట్టు అనుమతిస్తే ఆ జట్టుకు ఆడుకోవచ్చు. ఈ విషయాన్ని ఐపీఎల్ సీఈఓ రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఈ పద్ధతిని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఐపీఎల్‌లో అమలుచేసేందుకు ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ సీజన్ మధ్యలో ఖచ్చితంగా ఆ ఏర్పాటు ఉంటుందని నమ్మకాన్ని వ్యక్తపరిచారు. ఈ ట్రాన్స్‌ఫర్ విండో ఐదు రోజుల వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అది 28 వ మ్యాచ్ నుంచి 42 మ్యాచ్ లోపు జరగాలని వివరించారు. అది కూడా కేవలం వేరే జట్టు కోరుకుంటేనే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇందులో క్యాప్‌డ్, అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు కూడా పాల్గొనవచ్చు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పేరు మార్పు, జట్టులో నుంచి వేరే జట్టులోకి మారడం, రెండేళ్ల నిషేదం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మళ్లీ అడుగుపెడుతుండటం ఇలాంటి మార్పులన్నీ ఐపీఎల్ 11పై క్రేజ్ ని పెంచేస్తున్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.