ఐపీఎల్‌లో ధోనీ ఆధాయం అక్షరాల రూ.122.84 కోట్లా!!


బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా ఫామస్ అయి అత్యధిక క్రీడాభిమానులను సంపాదించుకున్న ఐపీఎల్ యువ క్రికెటర్లకు మంచి ప్లాట్‌ఫామ్‌గా మారింది. జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లతో ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న ఐపీఎల్ ఏ దేశీవాలీ లీగ్ ఇవ్వనంత అధిక మొత్తంలో ఆటగాళ్లకు ముట్టచెప్తుంది. దీంతో భారత ప్లేయర్లతో పాటుగా మరింత మంది టీ20 స్పెషలిస్టులతో నిర్వహిస్తోన్న బీసీసీఐ 11 ఏళ్ల చరిత్రలో అధిక వసూళ్లనూ రాబడుతోంది. మరి కొద్ది నెలల్లో మొదలుకానున్న ఐపీఎల్ 12వ సీజన్‌కు ముందు డిమాండుపరంగా అధికంగా తీసుకున్న ప్లేయర్లలో చూస్తే.. మహేంద్ర సింగ్ ధోనీ ఆధాయం రూ.122.84 కోట్లుగా ఉంది.

చెన్నైకు మూడో టైటిల్ అందించిన ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తూ 2018 ట్రోఫీ విజేతగా నిలిచిన ధోనీ.. ఐపీఎల్‌లో చెన్నై ఆడిన తొమ్మిది సీజన్లలో మూడో సారి టైటిల్ విజేతగా నిలిపాడు. చెన్నై జట్టు నిషేదానికి గురైన రెండేళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ జట్టు తరపున 2016, 2017 సంవత్సరాల్లో ఆడాడు.

ధోనీ తర్వాత రోహిత్, కోహ్లీలే
జాబితాలో ఎంఎస్ ధోనీ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అధిక మొత్తంలో వసూలు చేసే ఆటగాళ్లుగా నిలిచారు. భారత జట్టు వైస్ కెప్టెన్ దాదాపు అక్షరాల రూ.116.60కోట్లు వసూలు చేస్తున్నాడట. కానీ, టీమిండియా కెప్టెన్ మాత్రం 109.20 కోట్లు మాత్రమే ఐపీఎల్ ద్వారా లాభపడుతున్నాడు.

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్
ప్రకటించిన గౌతం గంభీర్ రూ. 94.62కోట్ల వరకూ వసూలు చేశాడు. ఇదే క్రమంలో మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన సురేశ్ రైనా మాత్రం.. రూ.88.74కోట్లు తీసుకుంటున్నాడు. లీగ్ మొత్తానికి విదేశీ ప్లేయర్లను డామినేట్ చేస్తూ.. భారత క్రికెటర్లే అధిక మొత్తం వసూలు చేస్తున్నారట. ఆ తర్వాతి వరుసలో ఏబీ డివిలియర్స్, సునీల్ నరైన్, షేన్ వాట్సన్‌లు ఏడు, ఎనిమిది, పదో స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా, ఈ జాబితాలో యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పలు కూడా ఉండటం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications