Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ లో 94 మ్యాచ్ లు?

ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక విషయాన్ని వెల్లడించారు. 2028 నుండి ఐపీఎల్ టోర్నమెంట్ పూర్తిస్థాయి హోమ్ అవే ఫార్మాట్‌లో జరగవచ్చని స్పష్టం చేశారు. ఈ నూతన విధానం అమలులోకి వస్తే, ప్రతి జట్టు ఒక సీజన్‌లో తొమ్మిది హోమ్ మ్యాచ్‌లు, అంతే సంఖ్యలో అవే మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. ఐపీఎల్ మొదట్లో ఎనిమిది జట్లతో జరిగినప్పుడు, ప్రతి జట్టు ఏడు హోమ్, ఏడు అవే మ్యాచ్‌లు ఆడేది.

2022లో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు చేరడంతో లీగ్ పది జట్లకు విస్తరించింది. అప్పటి నుండి, ప్రస్తుత ఫార్మాట్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి, జట్లను అయిదు చొప్పున రెండు గ్రూపులుగా విభజించి, ప్రతి జట్టు ఏడు హోమ్, ఏడు అవే మ్యాచ్‌లతో కలిపి మొత్తం 14 మ్యాచ్‌లు ఆడుతున్నాయి. ప్రస్తుతానికి జట్ల సంఖ్యను పెంచడం సమంజసం కాదని ధుమాల్ అభిప్రాయపడ్డారు. బదులుగా ప్రతి జట్టుకు 18 లీగ్ మ్యాచ్‌లతో కూడిన అసలు హోమ్-అవే ఫార్మాట్‌ను పునరుద్ధరించడంపై దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు.

IPL to Hit 94 Matches BCCI s Bold 2028 Expansion with Every Team Playing 18 League Games

ప్రస్తుతం ఉన్న జట్లతోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడేలా ఐపీఎల్ ఫార్మట్ లో మార్పులు జరుగనున్నాయి. ఇప్పడు జరిగే మ్యాచ్ ల సంఖ్య 74 నుండి 94 పెంచే ప్రతిపాదనలు ఉన్నట్లు ధుమాల్ వివరించారు. ఒక ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 94 మ్యాచ్‌లను నిర్వహించాలంటే బీసీసీఐకి ఎక్కువ వ్యవధి అవసరం. ప్రస్తుత ద్వైపాక్షిక క్రికెట్ షెడ్యూల్ 2027 వరకు ఖరారు అయినందున బీసీసీఐకి కేవలం 60 నుండి 65 రోజుల వ్యవధి మాత్రమే అందుబాటులో ఉంది.

ఈ పరిస్థితుల్లో 94 మ్యాచ్‌లను నిర్వహించడం ఒక సవాలుగా మారింది. తదుపరి ఐసీసీ సైకిల్ లో బీసీసీఐ రెండున్నర నెలల ప్రత్యేక విండో కోసం చర్చలు జరపాలని భావిస్తోంది. ఇది ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫ్రాంచైజీ టీ20 లీగ్‌కు కొంత వెసులుబాటు కల్పించి, అంతర్జాతీయ క్రికెట్‌కు విరామం ఇచ్చే అవకాశం ఉంది.

ద్వైపాక్షిక మ్యాచ్‌లు 2027 వరకు ఖరారు అయినందున, 74 నుండి 94కి మ్యాచ్‌ల సంఖ్యను పెంచడానికి ఎక్కువ సమయం అవసరమని ధుమాల్ వివరించారు. ఈ నేపథ్యంలో 2027 తర్వాత ద్వైపాక్షిక సైకిల్ ముగిసిన తర్వాత ఖచ్చితంగా 94 మ్యాచ్‌లను నిర్వహించడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. అలాగే మల్టిపుల్ డబుల్ హెడర్స్ అంటే ఒకే రోజు రెండు మ్యాచ్‌లు నిర్వహించాలనే ప్రతిపాదన సైతం ఉందని ధుమాల్ తెలిపారు. ఇది సాధారణంగా బ్రాడ్‌కాస్టర్‌లకు ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు.

Story first published: Friday, May 8, 2026, 15:36 [IST]
Other articles published on May 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+