Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL టైటిల్ స్పాన్సర్ మళ్లీ టాటాకే! బీసీసీఐకి కాసుల వర్షం

ప్రపంచ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో ఐపీఎల్‌దే అగ్రస్థానం. ఆదాయంతో పాటు ఆటలోనూ ఐపీఎల్ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. అందుకే ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్‌తో పాటు టైటిల్ స్పాన్సర్‌ హక్కుల కోసం ప్రముఖ సంస్థలు తీవ్రంగా పోటీపడుతుంటాయి. అయితే వచ్చే అయిదేళ్ల పాటు టైటిల్ హక్కులను టాటా గ్రూప్ సంస్థ చేజిక్కించుకున్నట్లు సమాచారం. దాని కోసం భారీ మొత్తాన్ని వెచ్చించనున్నట్టు తెలుస్తోంది.

టైటిల్ స్పాన్సర్ హక్కులను అయిదేళ్ల పాటు స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో 2018లో దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ భారత్-చైనా దౌత్యపరమైన ఉద్రికత్తల కారణంతో వివో 2022లో నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వివో ఒప్పందం స్థానంలో టాటా గ్రూప్ 2022లో టైటిల్ హక్కులు సంపాదించుకుంది. టాటా గ్రూప్ రూ.365 కోట్లు చెల్లించేలా మిగిలిన మొత్తాన్ని వివో ఇచ్చేలా ఒప్పందం జరిగింది.

IPL title sponsor Tata again! How many crores of rupees will be paid?
IPL 2024 టైటిల్ స్పాన్సర్ దకించుకున్న దిగ్గజ కంపెనీ.. BCCI కి | Telugu OneIndia

అయితే ఇటీవల టైటిల్ స్పాన్సర్ కోసం ఐపీఎల్ నిర్వాహకులు బిడ్డింగ్ పక్రియను ప్రారంభించారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఏడాదికి రూ.500 కోట్లు చెల్లించేలా రూ.2500 కోట్లతో టెండర్ వేసింది. అయితే అదే మొత్తాన్ని చెల్లించడానికి టాటా గ్రూప్ ముందుకు వచ్చింది. దీంతో ఇన్విటేషన్ టు టెండర్ డాక్యుమెంట్‌లోని నిబంధనలతో టాటాకే హక్కులు దక్కినట్టు సమాచారం. 2028 వరకు కొనసాగే టైటిల్ స్పాన్సర్ హక్కుల కోసం టాటా ప్రతీ సీజన్‌కు రూ.500 కోట్లు చెల్లించనుంది.

కాగా, మార్చి 2022 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లీగ్ షెడ్యూల్ ఖరారు కాలేదు. అయితే ఎన్నికలు ఉన్నప్పటికీ ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించాలని చూస్తున్నారు. మరోవైపు కొన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించాలని ఆ దేశ బోర్డు బీసీసీఐని కోరింది. ఇప్పటివరకు భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, దుబాయ్‌లో మాత్రమే ఐపీఎల్ నిర్వహించారు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో 74 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే 2025 నుంచి మ్యాచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. 2025, 2026 సీజన్లలో 84కి, 2027 సీజన్‌లో 94కి పెంచాలని భావిస్తున్నారు.

Story first published: Saturday, January 20, 2024, 9:11 [IST]
Other articles published on Jan 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+