Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో 100 కోట్లు సంపాదించింది వీరిద్దరే..

IPL 2018 : MS Dhoni & Rohith Sharma Joins In 100 Cr Club
IPL: The tournament’s 100 crore salary club

హైదరాబాద్: వేసవి ఆటవిడుపుగా అభిమానులకు దగ్గరై టీవీల ముందు నుంచి కదలకుండా చేసే ఐపీఎల్ వ్యాపారం కొన్ని కోట్ల రూపాయలలో జరుగుతుంది.

ఈ వేలంలో ప్రసార హక్కులను సొంతం చేసుకున్న వాళ్లు, ప్రైజ్ మనీ గెలుచుకున్న వాళ్లు, పలు అవార్డులు, రివార్డులు గెలుచుకున్న వాళ్లు.. ఇన్ని విధాలుగా పెద్ద మొత్తంలో లాభాలు చేకూరతాయి. వీటితో సంబంధం లేకుండా కేవలం కొనుగోలుతోనే రూ.100కోట్లు వరకూ సంపాదించిన టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు.

చెన్నై, ముంబై కెప్టెన్‌లు:

చెన్నై, ముంబై కెప్టెన్‌లు:

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీ, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఈ రూ.100కోట్ల క్లబ్‌లో చేరారు. ఈ పదకొండు ఐపీఎల్‌ సీజన్లలో ఆ జట్టు ఫ్రాంఛైజీ నుంచి వీరు ఒక్క వేతనం రూపంలోనే రూ.100కోట్లు పైగా సంపాదించేశారు. ధోనీ అత్యధికంగా రూ.107.8 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా రూ.101.6 కోట్లతో రోహిత్‌ ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.

రూ.6కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్‌‌కు ధోనీ:

రూ.6కోట్లకు చెన్నై సూపర్‌కింగ్స్‌‌కు ధోనీ:

2008లో ఐపీఎల్‌ తొలి సీజన్‌ కోసం నిర్వహించి వేలంలో ధోనీని చెన్నై సూపర్‌కింగ్స్‌ రూ.6కోట్లకు కైవసం చేసుకుంది. అప్పటి నుంచి 2015 వరకు ధోనీ అదే ఫ్రాంఛైజీకి నాయకత్వం వహించాడు. ఆ తర్వాత మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఆ ఫ్రాంఛైజీపై రెండేళ్ల పాటు నిషేధం విధించారు.

ధోనీ.. రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు:

ధోనీ.. రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు:

2016, 2017 సీజన్లలో ధోనీ.. రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తిరిగి ఈ ఏడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను నడిపించాడు. ఈ పునరాగమనంలోనే జట్టును ట్రోఫీ విజేతగా నిలబెట్టాడు. ముప్పై కి పైబడిని వారందరినీ జట్టులోకి తీసుకుంటున్నారనే విమర్శలను ఎదుర్కొంటూ, గాయాలపాలై జట్టులోని ఆటగాళ్లు దూరమవుతున్న ఒడిదుడుకులను తట్టుకుంటూ ఫైనల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించారు.

11 ఐపీఎల్‌ సీజన్ల ద్వారా రూ.100కోట్లకు పైగా:

11 ఐపీఎల్‌ సీజన్ల ద్వారా రూ.100కోట్లకు పైగా:

అలాగే ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన రోహిత్‌ శర్మ రూ.3కోట్లు పలికాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌లో చేరాడు. మూడుసార్లు ట్రోఫీ గెలుచుకున్న ముంబై ఇండియన్స్‌ జట్టులో రోహిత్‌ శర్మ సభ్యుడు. అరంగేట్ర సీజన్‌ నుంచి రోహిత్ ధర గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఐపీఎల్‌-11వ సీజన్‌లో ధోనీ, రోహిత్‌ కోసం ఆ జట్టు ఫ్రాంఛైజీలు రూ.15కోట్లు వెచ్చించాయి. ఈ లెక్కన వీరిద్దరూ పదకొండు ఐపీఎల్‌ సీజన్ల ద్వారా రూ.100కోట్లకు పైగా సంపాదించారు. ఇంకా మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్‌లతో పాటు ట్రోఫీ గెలిచినప్పుడు అందుకునే ప్రైజ్‌ మనీ దీనికి అదనం.

Story first published: Thursday, June 7, 2018, 16:55 [IST]
Other articles published on Jun 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+