For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ధోనీ ‘తలా ఫర్ ఏ రీజన్’- సునీల్ గవాస్కర్

మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే 'తలా ఫర్ ఏ రీజన్' అంటే మీకు తెలిసే ఉంటుంది. సందర్భం ఏదైనా దానిని చివరకు 7 వచ్చేలా ధోనీ అభిమానులు చేస్తారు. ఆ పేరులోని అక్షరాల సంఖ్యనో లేదో ఇతర కారణాలతో ధోనీ జెర్సీ నంబర్ 7 వచ్చేలా చూస్తుంటారు. దానికి తలా ఫర్ ఏ రీజన్ అంటూ కామెంట్స్ చేస్తుంటారు.

అయితే దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా 'తలా ఫర్ ఏ రీజన్' అంటూ జపం చేయడం విశేషం. ఎంఎస్ ధోనీ ప్రత్యేకత గురించి వివరిస్తూ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వాంఖడే వేదికగా రేపు ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్కే, ధోనీ గురించి గవాస్కర్ మాట్లాడాడు.

Explaining the uniqueness of MS Dhoni Sunil Gavaskar said Thala for a reason

''నాకు రెండు జట్లపై అభిమానం ఉంటుంది. నేను ముంబైకి చెందినవాడిని కాబట్టి ముంబై ఇండియన్స్. మరొకటి చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్‌లో ఇతర దేశాల నుంచి, వివిధ పట్టణాల నుంచి ఆటగాళ్లు జట్టులోకి వస్తుంటారు. వాళ్లందరిని ఒకతాటిపైకి తీసుకువచ్చి ఐపీఎల్ ట్రోఫీ లక్ష్యంగా సిద్ధం చేయాలి. ఆరు వారాల్లో టైటిల్‌ను అందుకోవాలి''

''ఈ క్రమంలో కొందరు గొప్ప ప్లేయర్లను మీ జట్టులో ఉన్నప్పటికీ టీమ్ కాంబినేషన్‌లో భాగంగా కొన్నిసార్లు పక్కనపెట్టాల్సి వస్తుంది. అయితే నిరూపయోగంగా ఉన్నామని ఫీలింగ్ వాళ్లలో తీసుకురానివ్వకూడదు. జట్టులో అంతర్భాగంగా ఉన్నామని భావన వాళ్లలో కలిగించాల్సి ఉంటుంది. ధోనీలో ఈ సామర్థ్యాలన్నీ ఉన్నాయి. అందుకే ధోనీని 'తలా ఫర్ ఏ రీజన్' అంటాం'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

ఈ సీజన్‌లో ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ సీఎస్సేకే పగ్గాలు అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ముంబై, చెన్నై 36 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్‌ల్లో నెగ్గగా, సీఎస్కే 16 మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే 2022 నుంచి చెన్నైదే పైచేయి. గత రెండు సీజన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నై మూడింట్లో గెలిచింది.

Story first published: Saturday, April 13, 2024, 15:25 [IST]
Other articles published on Apr 13, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+