IPL: ఆ జాబితాలో సీఎస్‌కే టాప్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సెకండ్!

ఐపీఎల్ 2022కు సమయం దగ్గరపడుతుంది. త్వరలోనే బెంగళూరు వేదికగా మెగా వేలం కూడా జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో ఇప్పటివరకు నమోదైన రికార్డుల గురించి చర్చ మొదలైంది. ఇందులో భాగంగానే గడిచిన 14 సీజన్‌లలో ఎక్కువ సార్లు ఏ టీం ఆటగాళ్లు ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు గెలిచారని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ టీం ఎన్ని క్యాప్‌లు గెలిచింది, అసలు ఎక్కువ సార్లు ఏ జట్టు గెలిచిందనే విషయాలను ఓ సారి పరిశీలిద్దాం. కాగా టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్లకు ఆరెంజ్ క్యాప్, ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లకు పర్పుల్ క్యాప్ ఇస్తారనే సంగతి తెలిసిందే.

ఎక్కువ సార్లు గెలిచింది ఎవరంటే?
ఐపీఎల్‌లో అత్యంత విజయంతమైన టీమైన చెన్నై సూపర్ కింగ్స్ హవా.. ఆరెంట్, పర్పుల్ క్యాప్‌లలోనూ కొనసాగింది. ఇప్పటివరకు ముగిసిన 14 ఐపీఎల్ సీజన్‌లలో చెన్నై ఆటగాళ్లు అత్యధికంగా 3 సార్లు ఆరెంజ్ క్యాప్, 4 సార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. 2009, 2013, 2021లో ఆరెంజ్ క్యాప్, 2013, 2014, 2015, 2019 సీజన్‌లలో పర్పుల్ క్యాప్‌ను గెలుచుకున్నారు. దీంతో ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి స్థానంలో ఉంది.

సన్‌రైజర్స్ ఎన్నంటే?
ఐపీఎల్‌లో ఎక్కువ సార్లు ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు గెలిచిన జట్ల జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఆరెంజ్ క్యాప్‌ను 3 సార్లు, పర్పుల్ క్యాప్‌ను 3 సార్లు గెలుచుకున్నారు. 2015, 2017, 2018 సీజన్‌లలో ఆరెంజ్ క్యాప్‌ను, 2016, 2017, 2018లో పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మూడో స్థానంలో మూడు ఆరెంజ్‌క్యాప్‌లు, ఒక పర్పుల్ క్యాప్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంది. ఆ జట్టు ఆటగాళ్లు 2011, 2012, 2016లో ఆరెంజ్ క్యాప్, 2021లో పర్పులు క్యాప్ గెలుచుకున్నారు.

ముంబై ఇండియన్స్ ఎన్ని గెలిచిందంటే..
ఈ జాబితాలో రెండు ఆరెంజ్ క్యాప్‌లు, ఒక పర్పుల్ క్యాప్‌తో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో ఉంది. ఆ జట్టు ఆటగాళ్లు 2008, 2020లో ఆరెంజ్ క్యాప్, 2018లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. ఇక ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన ముంబై ఇండియన్స్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ముంబై ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఒక సారి ఆరెంజ్ క్యాప్, ఒక సారి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. 2010లో ఆరెంజ్ క్యాప్, 2011లో పర్పుల్ క్యాప్ గెలిచారు. ఐపీఎల్‌లో హైదరాబాద్ పాత టీం అయినా డెక్కన్ చార్జర్స్ 2009, 2010లో పర్పుల్ క్యాప్ గెలుచుకుని ఆరో స్థానంలో ఉంది.

తక్కువ సార్లు గెలిచిన టీం
2012, 2020లో రెండు పర్పుల్ క్యాప్‌లు సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ ఏడో స్థానంలో ఉంది. ఇక 2014లో ఇక ఆరెంజ్ క్యాప్ సాధించిన కోల్‌కతా నైట్‌రైడర్స్, 2008లో ఒక పర్పుల్ క్యాప్ సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications