కోహ్లీ రికార్డు బద్దుల కొట్టిన ఐపీఎల్ సూపర్ స్టార్ సురేశ్ రైనా
హైదరాబాద్: సఫారీ గడ్డపై జోహెన్స్ బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం మూడో టెస్టులో తలపడుతున్న వేళ సురేశ్ రైనా కోల్‌కతాలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో విరాట్ కోహ్లీ రికార్డుని బద్దలు కొట్టాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతూ భారత జట్టులో చోటు కోల్పోయిన సురేశ్ రైనా తన పేరిట ఓ సరికొత్త రికార్డుని సృష్టించాడు.
టీ20ల్లో భారత్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేశ్ రైనా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా మంగళవారం ఈడెన్ గార్డెన్స్‌లో తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప‍్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సురేశ్ రైనా ఈ ఘనతను సాధించాడు.

టీ20ల్లో అగ్రస్థానానికి సురేశ్ రైనా
ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 61 పరుగులు చేసిన సురేశ్ రైనా 7,114 పరుగులతో టీ20ల్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రైనా తర్వాత విరాట్ కోహ్లీ 7,068 పరుగులతో రెండో స్ధానంలో నిలిచాడు. సోమవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సురేశ్ రైనా 59 బంతుల్లో 13 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 49 బంతుల్లో సెంచరీ చేసి టీ20ల్లో భారత్ తరుపున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరుని నమోదు చేశాడు.

టీ20ల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా
265 టీ20ల్లో 7,053 పరుగులతో కోహ్లీ రికార్డుకు దగ్గరగా వచ్చిన 31 ఏళ్ల సురేశ్ రైనా దానిని రోజు వ్యవధిలోనే అధిగమించడం విశేషం. టీ20 ఫార్మాట్‌లో సురేశ్ రైనా అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అన్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఈ విషయం ఎప్పుడో స్పష్టమైంది. ఐపీఎల్ 11వ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ జనవరి 4న నిర్వహించిన ఐపీఎల్ ప్లేయర్ రిటెన్షన్ ప్రాసెస్‌లో సురేశ్ రైనాను తమ వద్దే అట్టిపెట్టుకుంది.

భారత్ నుంచి సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ
ఇక, ఐపీఎల్ 2018 కోసం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం జరగనుంది. టీ20ల్లో ఏడు వేలకు పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలు మాత్రమే ఉన్నారు. వీరిద్దరి తర్వాత రోహిత్ శర్మ (6,825) పరుగులతో ఏడు వేలకు దగ్గరగా ఉన్నాడు. మొత్తంగా చూస్తే ఏడుగురు బ్యాట్స్‌మెన్ మాత్రమే టీ20ల్లో ఏడు వేలకు పైగా పరుగులు సాధించారు. ఈ జాబితాలో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ (11,000) పరుగులతో అగ్రస్ధానంలో ఉన్నాడు.

టీ20ల్లో ఏడు వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు: జనవరి 23, 2018 (3 PM IST) నాటికి:
* క్రిస్ గేల్ - 11,068 runs
* బ్రెండన్ మెక్‌కల్లమ్ - 8,769
* కీరన్ పొలార్డ్ - 7,816
* డేవిడ్ వార్నర్ - 7,572
* షోయబ్ మాలిక్ - 7,450
* బ్రాడ్ హాడ్జ్ - 7,406
* డ్వేన్ స్మిత్ - 7,351
* విరాట్ కోహ్లీ - 7,068
* సురేశ్ రైనా - 7,114
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications