Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL: వాళ్లపై వేటు వేస్తున్నాం- ఆర్సీబీ కోచ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ కల మరోసారి చెదిరింది. ఐపీఎల్-2024 సీజన్‌ను కూడా టైటిల్ సాధించకుండానే ముగించింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ సీజన్‌లో ఆర్సీబీకి కొన్ని సానుకూలాంశాలు కనిపించాయి.

ఈ సీజన్ ప్రారంభంలో తొలి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆర్సీబీ కేవలం ఒకే విజయం సాధించింది. ఆ స్థితిలో బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుతుందని దాదాపు ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆ తర్వాత డుప్లెసిస్ సేన గొప్పగా పుంజుకుంది. వరుసగా ఆరు విజయాలు సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను సైతం మట్టికరిపించి ప్లేఆఫ్స్‌కు చేరింది. కానీ ఎలిమినేటర్‌‌లో అదే జోరు ప్రదర్శించలేకపోయింది.

IPL Success at Chinnaswamy Requires Intelligent Bowlers with Specific Plans- RCB Coach Andy Flower

రాజస్థాన్ చేతిలో ఓడి ఓటమి బాధతో ఆర్సీబీ మైదానాన్ని వీడింది. కాగా, ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఆటగాళ్లను విడిచిపెడుతున్నామని పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. తమ సొంతమైదానం అయిన చిన్నస్వామి స్టేడియంలో సత్తాచాటాలంటే పేస్‌ను వేస్తే బౌలర్ల కంటే భిన్నమైన బంతులను సంధించే నైపుణ్యం ఉన్న బౌలర్లు కావాలని అన్నాడు. తెలివితో బౌలింగ్ చేసే ప్లేయర్లు కావాలని పేర్కొన్నాడు.

రూ.11.50 కోట్ల భారీ ధర చెల్లించి సొంతం చేసుకున్న అల్జారీ జోసెఫ్‌ను రిటైన్ చేసుకోవట్లదని అండీ ఫ్లవర్ హింట్ ఇచ్చాడు. కొత్త బంతితో, అతివేగంతో బంతులు సంధిస్తాడనే ఉద్దేశంతో జోసెఫ్‌కు భారీ ధర వెచ్చించారు. కానీ చిన్నస్వామి స్టేడియంలో జోసెఫ్ ధారళంగా పరుగులు సమర్పించున్నాడు. కాగా, పవర్ హిట్టర్లను జట్టులో కొనసాగించాలనుకుంటున్నామని తెలిపాడు.

బౌండరీల దూరం తక్కువగా ఉండే బెంగళూరులో భారీ హిట్లర్లు జట్టుకు ఉపయోగపడతారని అన్నాడు.దీంతో రూ.1.50 కోట్లకు సొంతం చేసుకున్న టామ్‌ కరన్‌కు ఆర్సీబీ ఫ్రాంచైజీ గుడ్‌ బై పలికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే సీజన్‌లో కూడా డుప్లెసిస్ కెప్టెన్ అని ఆండీ ఫ్లవర్ పరోక్షంగా చెప్పాడు. డుప్లెసిస్ జట్టును గొప్పగా నడిపించాడని అన్నాడు. ఆశలు లేని స్థితి నుంచి జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో కోహ్లి-డుప్లెసిస్ ఎంతో శ్రమించారని అన్నాడు.

Story first published: Thursday, May 23, 2024, 13:55 [IST]
Other articles published on May 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+