For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓటమి నుంచి గుణపాఠం: 'పూణెను ఓడించడం కష్టమే'

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ సొంతగడ్డపై జరగనుంది.

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ సొంతగడ్డపై జరగనుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సొంతగడ్డపై ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో సన్ రైజర్స్ విజయం సాధించింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్ సందర్భంగా సన్ రైజర్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ పూణెను ఓడించడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. వరుస విజయాలతో ఊపు మీద ఉన్నపూణెతో జరిగే మ్యాచ్ టఫ్ గేమ్ అని, అయినా సమిష్టిగా రాణిస్తామని విలిమయ్సన్ అన్నాడు.

ప్రతి ఒక్క మ్యాచ్ ఛాలెంజ్ అని, ఇప్పటి వరకు మంచి క్రికెట్ ఆడామని, పూణెతో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తామని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎప్పుడూ విజయాలు సొంతం కావని, ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పాడు.

IPL Stint Good For Champions Trophy Preparation, Says Kane Williamson

సన్ రైజర్స్ జట్టులో మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్న తాను బట్టుకు ఏమి కావాలో అదే చేస్తానని అన్నాడు. అవసరమైతే ఏ స్ధానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు తాను సిద్ధమని చెప్పాడు. వార్నర్ మంచి కెప్టెన్ అని, అతని కెప్టెన్సీలో ఆడటం సంతోషంగా ఉందని విలియమ్సన్ తెలిపాడు.

ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగామని, తద్వారా మాజట్టుపై కొంత ఒత్తిడి ఉందని, గత సీజన్‌లో కంటే ఈ సీజన్‌లో మా ఆట తీరు చాలా మెరుగ్గా ఉందని చెప్పాడు. గత మ్యాచ్ ఢిల్లీతో భారీ స్కోరు చేసినా ఓడిపోయామని, ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నామని చెప్పాడు.

ఈ సీజన్‌లో మిగితా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తామని విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ అనుభవం వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి ఎంతగానో ఉపయోగపడుతుందని విలియమ్సన్ తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+