Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రియాన్ పరాగ్ హిట్ వికెట్.. స్మిత్ రియాక్షన్ (వీడియో)

IPL 2019 : Steve Smith's Stunning Reaction To Riyan Parag's Dramatic Dismissal || Oneindia Telugu
IPL: Steve Smith Reaction over Riyan Parags Dramatic Dismissal

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ ఆటగాడు రియాన్ పరాగ్ అనూహ్య రీతిలో హిట్ వికెట్ అవుట్ అయాడు. ఈ సమయంలో డగౌట్ లో కూర్చున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. అయ్యో అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా.. కార్తీక్‌ ఒంటరి పోరాటంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాట్స్‌మన్‌ రహానే, సాంసన్, స్మిత్, స్టోక్స్ లు పెవిలియన్ చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ (31 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టును ఆదుకున్నాడు. అతనికి శ్రేయస్ గోపాల్ (9 బంతుల్లో 18; 4 ఫోర్లు) సహకారం అందించాడు. ఇద్దరు బౌండరీలు బాదడంతో విజయ సమీకరణం 18 బంతుల్లో 31కి చేరింది. ప్రసిధ్ వేసిన 18వ ఓవర్లో పరాగ్ ఫోర్, సిక్స్ బాదాడు. ఆ తర్వాత రస్సెల్ వేసిన 19వ ఓవర్ నాలుగో బంతికి సిక్సర్ కొట్టి ఊపుమీదున్నాడు.

ఇక రస్సెల్ వేసిన 19వ ఓవర్ ఐదో బంతిని పరాగ్ హుక్ షాట్ ఆడగా.. బంతి బౌండరీ వెళ్ళింది. అయితే షాట్ ఆడే క్రమంలో బ్యాట్ వికెట్లను తాకడంతో.. అతను హిట్ వికెట్ అవుట్ అయ్యాడు. ఇది గమనించని అంపైర్ నో బాల్ ఇచ్చి.. ఫోర్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. రస్సెల్ అసలు విషయం చెప్పడంతో.. థర్డ్ అంపైర్ సహాయం తీసుకుని అవుట్ గా ప్రకటించాడు. ఈ సమయంలో డగౌట్ లో కూర్చున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్.. అయ్యో అంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.

Story first published: Friday, April 26, 2019, 15:31 [IST]
Other articles published on Apr 26, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+