
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ చరమాంకం వచ్చేసింది. ఇంకొక ఐదు మ్యాచ్‌లు ముగిస్తే లీగ్ దశ పూర్తయినట్లే. లీగ్ దశకు ముగిసేవరకు ఏ జట్లు అయితే టాప్ 4స్థానాల్లో ఉంటాయో అవే ప్లేఆఫ్‌కు చేరతాయి. 11సీజన్‌లు ముగిసిపోతోన్న ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అరుదైన రికార్డు ఈసారి నమోదైంది. ఇంకా లీగ్ దశ ముగియక ముందే 51వ మ్యాచ్ ముగిసే సరికే 748 సిక్సర్లు నమోదయ్యాయి.
ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో ఇవే అత్యధిక సిక్స్‌లు కావడం విశేషం. అంతకు ముందు 2012 సీజన్‌లో 75 మ్యాచ్‌ల్లో బ్యాట్స్‌మెన్ 732 సిక్స్‌లు బాదేశారు. దాదాపు అన్ని జట్ల ఓపెనర్లు ఫామ్‌లోనే ఉండటంతో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన వారిలో వారే అత్యధికంగా నమోదు చేయగలిగారు. కొన్ని జట్లలో వన్‌డౌన్, సెకండ్ డౌన్ ఆటగాళ్లు భారీ సిక్సర్లు కొట్టారు. ఇక చెన్నై అత్యధికంగా 116 సిక్స్‌లు బాదింది. ప్రస్తుత లీగ్ టేబుల్‌లో టాప్ స్థానంలో కొనసాగుతోన్న సన్‌రైజర్స్ 62తో అట్టడుగున నిలిచింది.
అధిక సిక్సర్లు నమోదు చేసిన ఆటగాళ్లు:
లోకేశ్ రాహుల్ (పంజాబ్) : 32 సిక్సర్లు
రిషబ్ పంత్ (ఢిల్లీ): 31
ఏబీ డివిలియర్స్ (బెంగళూరు): 30
ఎంఎస్ ధోనీ (చెన్నై): 29
అంబటి రాయుడు (చెన్నై): 29
క్రిస్‌గేల్ (పంజాబ్): 27
ఆండ్రూ రసెల్ (కోల్‌కతా): 26
షేన్ వాట్సన్ (చెన్నై): 26
కేన్ విలియమ్సన్ (హైదరాబాద్): 23
శ్రేయాస్ అయ్యర్ (దిల్లీ): 21
జట్ల వారీగా నమోదు చేసిన సిక్సర్లు:
చెన్నై సూపర్ కింగ్స్: 116
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 104
కోల్‌కతా నైట్‌రైడర్స్ : 107
రాజస్థాన్ రాయల్స్ : 66
సన్‌రైజర్స్ హైదరాబాద్: 62
కింగ్స్ ఎలెవన్ పంజాబ్: 96
ముంబై ఇండియన్స్: 98
ఢిల్లీ డేర్‌డెవిల్స్: 99