For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

125 పరుగుల తేడాతో భారీ విజయం: సత్తా చాటిన ఇండియా-ఏ

By Nageshwara Rao
IPL stars Prithvi Shaw, Deepak Chahar guide India A to victory in England

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్‌ వన్డే మ్యాచ్‌లో ఇండియా-ఏ జట్టు 125 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పృథ్వీ షా, శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ అద్భుత ప్రదర్శన చేశారు.

IPL stars Prithvi Shaw, Deepak Chahar guide India A to victory in England

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 328 పరుగులు చేసింది. భారత ఆటగాళ్లలో ఓపెనర్ పృథ్వీ షా(70)ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్‌ అయ్యర్‌(54), ఇషాన్‌ కిషన్‌ (50) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఇంగ్లాండ్‌ బౌలర్‌ హిగ్గిన్స్‌కు నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 329 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ బోర్డు ఎలెవన్ జట్టు 36.5 ఓవర్లలో 203 పరుగులకే కుప్పకూలింది. మాథ్యూ క్రిచెల్లీ(40), బెన్‌ స్లాటర్‌(37), హాన్‌కిన్స్‌(27), విల్‌ జాక్స్‌(28)లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు.

దీంతో ఇండియా-ఏ జట్టు 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్‌కు మూడు, అక్షర్‌ పటేల్‌ రెండు, ప్రసిద్‌ కృష్ణ, ఖలీల్‌ అహ్మద్‌, విజయ్‌ శంకర్‌కు తలో వికెట్‌ తీశారు. జూన్ 22 నుంచి ఇండియా-ఏ జట్టు ఇంగ్లాండ్‌ లయన్స్‌, వెస్టిండీస్‌-ఏతో ముక్కోణపు వన్డే సిరీస్‌ ఆడనుంది.

అనంతరం జులైలో ఈ రెండు జట్లతోనే ఇండియా-ఏ జట్టు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ సిరిస్ ఆడనుంది.

Story first published: Monday, June 18, 2018, 16:05 [IST]
Other articles published on Jun 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+