Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈ కాలపు భీష్ముడు భయ్యా.. బుడ్డోడి ఇన్‌స్టా సీక్రెట్ లీక్!

ఐపీఎల్ 2026 సీజన్లో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డులను గెలిచుకున్న రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాడు. అయితే ఈ సారి వైభవ్ వార్తల్లో నిలవడానికి కారణం మైదానంలో చేసిన పరుగుల రికార్డులు కాదు.. అతడి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్, అందులోని ఓ ఇంట్రెస్టింగ్ విషయం. దీనిని గమనించిన క్రికెట్ అభిమానులు వైభవ్ సూర్యవంశీని 'మోడ్రన్ సన్యాసి', 'నిజమైన బ్రహ్మచారి' అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అసలు విషయమేమిటంటే.. వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా స్క్రీన్‌షాట్ ఒకటి ప్రస్తుతం నెటిజన్ల మధ్య విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానులు వైభవ్ సూర్యవంశీ ఖాతాను నిశితంగా గమనించినప్పుడు ఓ విచిత్రమైన విషయం వెలుగుచూసింది. వైభవ్ సూర్యవంశీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి మొత్తం 337 మందిని ఫాలో అవుతున్నాడు. కానీ ఆ 337 ప్రొఫైల్స్‌లో ఒక్కటంటే ఒక్కటి కూడా మహిళ లేదా అమ్మాయి ప్రొఫైల్ లేదు. వైభవ్ సూర్యవంశీ ఫాలోయింగ్ లిస్ట్‌లో కేవలం పురుష క్రికెటర్లు, కోచ్‌లు, క్రికెట్ ప్రముఖులు, స్నేహితులు, స్పోర్ట్స్ బ్రాండ్లు మాత్రమే ఉన్నాయి.

IPL Star Vaibhav Sooryavanshi Instagram Following List Goes Viral for Monk Mode Full Details

15 ఏళ్ల ఈ యువ క్రికెటర్ సోషల్ మీడియా స్ట్రాటజీని చూసి క్రికెట్ ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. ఫ్యాన్స్ దీనిని సరదాగా వైభవ్ సూర్యవంశీ 'సన్యాసి జీవన విధానం' అని పిలుస్తున్నారు. సాధారణంగా ఈ చిన్న వయసులో యువత సోషల్ మీడియా ప్రపంచంలో, ఇతర ఆకర్షణల్లో పడి తమ కెరీర్‌ను పక్కన పెడుతుంటారని, కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఎలాంటి వాటి వైపు మళ్లకుండా కేవలం తన ఆటపై, క్రికెట్ నైపుణ్యాలపై మాత్రమే 100 శాతం దృష్టి సారించాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. అందుకే ఈ కుర్రాడు ఇంత చిన్నవయసులోనే ఐపీఎల్‌లో అద్భుతాలు సృష్టించగలిగాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Thursday, June 4, 2026, 13:40 [IST]
Other articles published on Jun 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+